చోళుల కాలం నాటి పంచలోహ విగ్రహాలు
బ్రహ్మలింగేశ్వరస్వామి ఆలయంలో కనుల పండువగా శివపార్వతుల కల్యాణం
నర్సీపట్నం: బలిఘట్టం శ్రీబ్రహ్మలింగేశ్వర స్వామి ఆల యంలో చోళుల కాలం ( 16వ శతాబ్దం) నాటి శివపార్వతుల పంచలోహ విగ్రహాలను దేవదాయశాఖ అధికారులు ప్రతిష్టించారు. శుద్ధ ఏకాదశి రోజున పంచలోహా విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించాలని కమిటీ వారు పట్టుబట్టారు. దీంతో సబ్‌ట్రెజరీలో భద్రపరిచిన ఈ విగ్రహాలను ఈ నెల 11వ తేదీన ఎండోమెంట్ అధికారులు పోలీసు బందోబస్తు నడుమ తీసుకొని వచ్చి ఆలయంలో ప్రతిష్టించారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా ఈ పంచలోహ విగ్రహాలకే శివపార్వతుల కల్యాణం జరిపించారు. ఈ అరుదైన దృశ్యాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఆలయంలోని అతి పురాతనమైన ఈ పంచలోహ విగ్రహాలు 1990లో చోరీ అయ్యాయి. తాళ్లరేవు ప్రాంతంలో పోలీసులు వీటిని రికవరీ చేశారు. అప్పటి నుంచి విగ్రహాలను ట్రెజరీలో భద్రపరిచారు. కమిటీ వారి అభ్యర్థన మేరకు ఆలయ అధికారులు విగ్రహాలను ఆలయానికి తీసుకువచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment