మద్యం షాపు మాకొద్దు బాబోయ్‌ | - | Sakshi
Sakshi News home page

మద్యం షాపు మాకొద్దు బాబోయ్‌

Published Wed, Nov 13 2024 1:33 AM | Last Updated on Wed, Nov 13 2024 1:33 AM

మద్యం షాపు మాకొద్దు బాబోయ్‌

మద్యం షాపు మాకొద్దు బాబోయ్‌

అనకాపల్లి: పట్టణంలోని శారదానగర్‌ ప్రాంతంలో మద్యం షాపును ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని శారద సంక్షేమ సంఘం ప్రతినిధులు వైన్‌షాప్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో శారదానది బ్రిడ్జి నుంచి రూరల్‌ పోలీస్‌స్టేషన్‌ వరకు మహిళలు, యువకులు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కొత్తూరు పంచాయతీ పరిధి శారదానగర్‌లో ఎట్టి పరిస్థితుల్లో మద్యం దుకా ణం ఏర్పాటు చేయవద్దని పంచాయతీలో తీర్మానం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాన్ని తక్షణమే తొలగించాలన్నారు. శారదా సంక్షేమ సంఘం ప్రతినిధులు, ఉపాధ్యాయులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

తొలగించాలని శారదానగర్‌వాసుల కొవ్వొత్తుల ర్యాలీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement