సమష్టి కృషితో ప్రగతి సాధ్యం
సాక్షి, అనకాపల్లి: సమష్టి కృషితోనే జిల్లా ప్రగతి సాధ్యమని రాష్ట్ర భూగర్భ గనుల శాఖ మంత్రి, అనకాపల్లి జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో మంత్రి అధ్యక్షతన జిల్లా సమీక్ష సమావేశం (డీఆర్సీ) జరిగింది. కలెక్టర్ విజయ కృష్ణన్, జేసీ జాహ్నవి, జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్ర, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు హాజరైన ఈ సమావేశంలో పంచాయతీరాజ్, డ్వామా, జిల్లా పరి షత్, గృహ నిర్మాణ, రహదారులు, జలవనరులు, భూగర్భ గనుల శాఖలపై సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తలసరి ఆ దాయం, స్థూల దేశీయ ఉత్పత్తిలో అనకాపల్లి జిల్లా 12వ స్థానంలో ఉందన్నారు. మొదటి స్థానంలో ఉన్న విశాఖపట్నం జిల్లాతో పోటీపడేలా అందరం కృషి చేయాలని చెప్పారు. జిల్లాలో రహదారుల గుంతలకు ఈ నెలాఖరులోగా మరమ్మతు పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. అనకాపల్లిలో ఫ్లైఓవర్ నిర్మాణం కోసం భూములు ఇచ్చిన నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి ఆయా గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించాలని సూచించారు. నియోజకవర్గ స్థాయిలో పారిశ్రామిక పార్క్‌లు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందు కోసం ప్రతి మండలంలోనూ అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూ ములను గుర్తించేందుకు, ల్యాండ్ బ్యాంకు ఏర్పా టుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయకుమార్, కె.ఎస్.ఎన్.ఎస్.రాజు, పంచకర్ల రమేష్‌బాబు, డీఆర్‌వో సత్యనారాయణరావు, అనకాపల్లి, నర్సీపట్నం రెవెన్యూ డివిజనల్ అధికా రులు, తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్ పట్టదా?
డీఆర్సీ సమావేశంలో ప్రొటోకాల్ పాటించలేదు. ఎమ్మెల్సీ వరుదు కల్యాణికి ఆహ్వానం లేదు. జెడ్పీ చైర్‌పర్సన్ సుభద్రకు సమావేశం మధ్యాహ్నం 2.45 గంటలకు అని చెప్పి, సాయంత్రం 5 గంటలకు ప్రారంభించారు. అంతవరకు ఆమె వేచి ఉండాల్సివచ్చింది. సాధారణంగా డీఆర్సీ సమావేశం ముగిశాక విశేషాలను ఇన్‌చార్జి మంత్రి ప్రెస్‌మీట్‌లో వివరిస్తారు. ఈసారి ప్రెస్‌నోట్‌తో సరిపెట్టారు. ఎన్నడూ లేనివిధంగా సమావేశానికి ముందు ప్రెస్‌మీట్ పెట్టి తమ ప్రభుత్వ ఘనతను చాటుకొనే ప్రయత్నం చేశారు.
అభివృద్ధిలో విశాఖతో పోటీ పడాలి
గుంతల మరమ్మతులు ఈ నెలాఖరులోగా పూర్తి
డీఆర్సీ సమావేశంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి కొల్లు రవీంద్ర
Comments
Please login to add a commentAdd a comment