అనంతపురంలో ప్రార్థనలు చేస్తున్న ముస్లింలు
అనంతపురం సప్తగిరి సర్కిల్: ముస్లింల అత్యంత పవిత్రమైన రంజాన్ మాసం శుక్రవారం ప్రారంభమైంది. నగరంలోని మసీదుల్లో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. రంజాన్ మాసంలోనే పవిత్ర ఖురాన్ భూమిపై అవతరించిందని, ఈ మాసంలో ఉపవాసం ఉండడం ప్రతి ముస్లిం ప్రధాన విధి అని మౌలానాలు తెలిపారు. మానవుని జీవితాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దే గొప్ప గ్రంథం ఖురాన్ అని కొనియాడారు. పేదల పట్ల దయ, తోటివారి పట్ల ప్రేమ కలిగి ఉండాలని అల్లాహ్ ఆదేశాలను, మొహమ్మద్ ప్రవక్త మార్గాలను పాటించాలని సూచించారు. చెడు మాటలు, చెడు చేష్టలు, చెడు వ్యసనాల నుంచి దూరం చేసేదే ఉపవాసమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment