ఇసుక రీచ్‌ వద్దే వద్దు | - | Sakshi
Sakshi News home page

ఇసుక రీచ్‌ వద్దే వద్దు

Published Wed, Nov 13 2024 1:20 AM | Last Updated on Wed, Nov 13 2024 1:20 AM

ఇసుక రీచ్‌ వద్దే వద్దు

ఇసుక రీచ్‌ వద్దే వద్దు

యల్లనూరు: తిరుమలాపురం – చిలమకూరు సమీపంలో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను జిల్లా మైనింగ్‌ డిప్యూటీ డైరెక్టరు వెంకటేశ్వర్లు, తాడిపత్రి ఏడీ ఓబుళరెడ్డి మంగళవారం పరిశీలించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు మైనింగ్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇసుక రీచ్‌ ప్రదేశాన్ని పరిశీలించి, అనంతరం తిరుమలాపురం పంచాయతీ కార్యాలయంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. చిలమకూరు, తిరుమలాపురం గ్రామాలకు చెందిన ప్రజలు ఇసుక రీచ్‌ వద్దని ముక్తకంఠంతో నినదించారు. రీచ్‌ ప్రారంభిస్తే ప్రాణాలు పోవడం ఖాయమని స్పష్టం చేశారు. ఈ విషయమై గ్రామస్తులు మైనింగ్‌ అధికారులు, కాంట్రాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. కార్యక్రమంలో రాయల్టీ ఇన్‌స్పెక్టరు కవిత, చిలమకూరు సర్పంచ్‌ పెద్ద నాగరాజు, వైఎస్సార్‌సీపీ నాయకులు కృష్ణారెడ్డి, రవిచంద్రారెడ్డి, హరినాథరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, యోగానందరెడ్డి, కిషోర్‌కుమార్‌రెడ్డి, సూర్యనారాయణరెడ్డి, గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement