ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు

Published Fri, Oct 11 2024 2:54 AM | Last Updated on Fri, Oct 11 2024 2:54 AM

ప్రజల

అనంతపురం అర్బన్‌: చెడుపై మంచి, దుష్ట శక్తులపై దైవశక్తి సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి అని కలెక్టర్‌ వి.వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన దసరా శుభాకాంక్షలు తెలియజేశారు. జగన్మాత ఆశీస్సులతో జిల్లా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖశాంతులు,సిరి సంపదలతో ఆనందంగా ఉండాలని ఆకాంక్షించారు.

19న జెడ్పీ సర్వసభ్య సమావేశం

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం ఈ నెల 19న నిర్వహించాలని జెడ్పీ పాలకవర్గం, అధికారులు నిర్ణయించారు. గతంలో జూలై 9న జెడ్పీ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. 101 రోజుల తరువాత మళ్లీ ఇప్పుడు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. 90 రోజులకోసారి (మూడు నెలలు) సర్వసభ్య సమావేశం నిర్వహించాలి. అయితే జెడ్పీ అధికారులు ఎప్పుడూ ఈ నిబంధన పాటించ లేదు. తమకు నచ్చినట్లు నిర్వహిస్తూ వస్తున్నారు. ఐఏఎస్‌లు ఇన్‌చార్జ్‌ సీఈఓలుగా పని చేసిన రోజుల్లోనూ ఈ నిబంధన పాటించలేదు. ఈ సారి 11 రోజులు ఆలస్యంగా నిర్వహిస్తున్నారు. జెడ్పీలో అధికార పక్షంగా వైఎస్సార్‌సీపీ ఉండగా, టీడీపీ కూటమి తరపున గెలిచిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతిపక్ష పాత్ర పోషించనున్నారు. దీంతో ఈసారి భారీ సంఖ్యలో పోలీసులు మోహరించనున్నట్లు తెలుస్తోంది. సమావేశానికి సంబంధించి 63 మండలాల జెడ్పీటీసీ సభ్యులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా అన్ని శాఖలకు సంబంధించిన జిల్లా స్థాయి అధికారులకు సమాచారం చేరవేశారు. సమగ్ర వివరాలతో సమావేశానికి హాజరు కావాలని అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది.

భూముల మార్కెట్‌

విలువ సవరించాలి

అనంతపురం అర్బన్‌: భూముల మార్కెట్‌ విలువ సవరణపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని జాయింట్‌ కలెక్టర్‌ శివ నారాయణ శర్మ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్‌ హాలులో రిజిస్ట్రేషన్‌, అనుబంధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు సమన్వయంతో పనిచేసి భూమి మార్కెట్‌ విలువ సవరణ చేపట్టాలని సూచించారు. మార్కెట్‌ విలువ ప్రతిపాదనలపై రిజిస్ట్రేషన్‌, అనుబంధ శాఖలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో జిల్లా రిజిస్ట్రార్‌ భార్గవ్‌, ఆర్డీఓ వసంత బాబు, జెడ్పీ ఇన్‌చార్జ్‌ సీఈఓ వెంకటసుబ్బయ్య, సర్వే భూ రికార్డుల శాఖ ఏడీ రూప్లానాయక్‌, ఉద్యాన శాఖ డీడీ నరసింహరావు, మునిసిపల్‌ అధికారులు, తహసీల్దార్లు, సబ్‌ రిజిస్ట్రార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
ప్రజలకు కలెక్టర్‌  దసరా శుభాకాంక్షలు 1
1/2

ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు

ప్రజలకు కలెక్టర్‌  దసరా శుభాకాంక్షలు 2
2/2

ప్రజలకు కలెక్టర్‌ దసరా శుభాకాంక్షలు

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement