కులగణనతోనే బీసీలకు న్యాయం
అనంతపురం అర్బన్: జనాభాలో 52 శాతం ఉన్న బీసీలు అన్నివిధాల అణచివేతకు గురవుతున్నారని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు వి.బి.భాస్కర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. కులగణనతోనే బీసీలకు రాజ్యాంగబద్ధమైన ప్రయోజనాలు చేకూరతాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టనున్న జనగణనతోపాటు కులగణన కూడా చేపట్టాలంటూ సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా భాస్కర్‌బాబు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఏ ప్రభుత్వాలు సమగ్ర కులగణన జరిపించలేదన్నారు. జనాభా దామాషా ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు అన్ని రంగాల్లోనూ రాయితీలు, రిజర్వేషన్లు అమలవుతున్నాయన్నారు. అయితే వవెనుకబడిన తరగతులకు చెందిన ఓబీసీలకు రాజ్యాంగబద్ధమైన ప్రయోజనాలు అందడం లేదన్నారు. అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు, రాయితీలు సక్రమంగా అమలు కావాలన్నా, వారు సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నా, భవిష్యత్తులో రిజర్వేషన్లపై ఆచరణాత్మక విధానాలు రూపొందించాలన్నా కులాల జనాభాను సమగ్రంగా లెక్కించాలని అత్యున్నత న్యాయస్థానం తెలిపిందన్నారు. ఓబీసీల అభివృద్ధితోనూ దేశాభివృద్ధి ముడిపడి ఉన్నందున కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతోపాటు సమగ్ర కులగణన జరిపించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ అఽధికారులకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకులు డీకే రామలింగం, అనిల్‌కుమార్, లక్ష్మీనారాయణ, కేశవకుమార్‌గౌడ్, రమాదేవి, చంద్రమౌళి, గోల్డ్ రామాంజి, తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్‌బాబు
Comments
Please login to add a commentAdd a comment