జాతీయ స్థాయి బధిరుల క్రికెట్ టోర్నీ ప్రారంభం
అనంతపురం: స్థానిక ఆర్డీటీ స్టేడియం వేదికగా జాతీయ స్థాయి బధిరుల క్రికెట్ టోర్నీ (అండర్–19) సోమవారం ప్రారంభమైంది. వినికిడి లోపం ఉన్న పురుషుల 8 జట్లు పాల్గొన్నాయి. ఈ నెల 28న ఫైనల్ మ్యాచ్ నిర్వహించనున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీటీ స్పోర్ట్స్ డైరెక్టర్ సాయికృష్ణ , కేన్ పిన్ హోమ్ లిమిటెడ్ మేనేజర్ వి.దేవరాజ్, ఏసీఏ కోచ్ యుగంధర్‌రెడ్డి, డెఫ్ క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ అధ్యక్షుడు కె.గోపీనాథ్, ఆర్గనైజింగ్ సెక్రెటరీ నాగరాజు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. ఐడీసీఏ అధ్యక్షుడు సుమిత్ జైన్ మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి క్రికెట్ మాత్రమే కాకుండా ఆత్మవిశ్వాసం పెంపొందించేలా పోటీలు నిర్వహించడం సంతోషదాయకమన్నారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసా నగదు బహుమతిని అందజేశారు.
నగరంలో డ్రోన్‌ల పహారా
అనంతపురం: నగరంలోని వన్ టౌన్, ఫోర్త్ టౌన్, రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిల్లోని శివారు ప్రాంతాల్లో డ్రోన్‌ల ద్వారా పహారా చేపట్టారు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న పలువురు పట్టుబడడంతో వారిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. నేరాలు జరిగే అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, తోటలు, బహిరంగ ప్రదేశాలు, పార్కులను ముందుగా గుర్తించి ఆయా ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలను పంపి నిఘా పెంచారు.
Comments
Please login to add a commentAdd a comment