No Headline
● గార్లదిన్నె సమీపంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాద ఘటన జిల్లావాసులను దిగ్భ్రాంతికి గురి చేసింది. వ్యవసాయ కూలి పనులు ముగించుకుని ఇంటికి ఆటోలో తిరిగి వెళుతుండగా ఆర్టీసీ బస్సు ఢీకొని ఎనిమిది కూలీలు దుర్మరణం పాలవడం కలచివేసింది. ఇదే ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్ల అవగాహన రాహిత్యంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు.
● బొమ్మనహాళ్ మండలం శ్రీనివాసక్యాంప్ సమీపంలో ఇటీవల రెండు బైకులు ఢీకొన్న ఘటనలో వృద్ధుడు మృతి చెందాడు. సూపర్ ఎక్స్‌ఎల్‌పై వెళ్తున్న దేవగిరి క్రాస్‌కు చెందిన కొండయ్యను బైకుపై మరో వ్యక్తి ఢీకొనడంతో ప్రాణాలు
కోల్పోయాడు. ఇలా జిల్లాలో రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో రహదారులు రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట చోటుచేసుకుంటున్న ప్రమాదాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తున్నాయి. ఆటోలు, ద్విచక్ర వాహనాలతో పాటు భారీ వాహనాలు కూడా శ్రుతి మించిన వేగంతో వెళుతుండటం ఊహించని ఘటనలకు దారి తీస్తున్నాయి.
అతివేగం.. ఓవర్ లోడుతోనే
రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా ద్విచక్రవాహన దారులే మృతి చెందుతున్నారు. దీనికి కారణం అతి వేగమేనని అధికారులు నిర్ధారించారు. అధిక సామర్థ్యం కలిగిన టూవీలర్లలో 140 నుంచి 170 కిలోమీటర్ల వేగంతో వెళుతుండటంతో అదుపు తప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆటోల గురించి చెప్పాల్సిన పని లేదు. సాధారణంగా ఆటోలో తరలించాల్సింది ఆరుగురిని అయితే 15 నుంచి 20 మంది వరకూ తీసుకెళ్తున్నారు. దీంతో ప్రమాదాలు జరిగి భారీగా ప్రాణ నష్టం వాటిల్లుతోంది. ద్విచక్రవాహనాల ప్రమాదాల్లో మృతి చెందుతున్న వారిలో ఎక్కువగా 22 ఏళ్లలోపు వారు ఉంటే, ఆటోల్లో ఎక్కువగా ప్రమాదానికి గురై చనిపోతున్నది పేదలు, కూలీలు కావడం గమనార్హం.
తెల్లవారుజామునే ఘటనలు..
పెద్ద పెద్ద ఘటనలు ఎప్పుడూ తెల్లవారుజామున 4 గంటల లోపే జరుగుతున్నాయి. ఇందుకు ప్రధానంగా డ్రైవర్లు నిద్రలేమితో ఉండటమే కారణమని వెల్లడైంది. లారీ డ్రైవర్లు రోజుల తరబడి డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలకు గురవుతున్నారు. ఇక.. ద్విచక్రవాహన దారులు మితిమీరిన స్పీడు కారణంగా ప్రమాదాల్లో చిక్కుకుంటున్నారు. ఆటో డ్రైవర్లు పరిమితికి మించి జనాన్ని తరలిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్నారు.
జాతీయ రహదారులపై
మృత్యు ఘంటికలు
ఓవర్ లోడ్‌తో తరచూ ప్రమాదాలు
హై స్పీడుతో అదుపుతప్పి బోల్తా
రోడ్డు ప్రమాదాల్లో నాలుగేళ్లలో
1,311 మంది మృత్యువాత
వేగం తగ్గిస్తే ప్రమాదాలు
అరికట్టవచ్చంటున్న అధికారులు
Comments
Please login to add a commentAdd a comment