● గరిటైడెన చాలు ఖరము పాలు..
● ఊడల మర్రి..
ఆత్మకూరు: ఎటు చూసినా కాంక్రీట్ జంగిల్ పెరిగిన నేటి ఆధునిక సమాజంలో భారీ వృక్షాలు చాలా అరుదుగా కనిపిస్తున్నాయి. ఎక్కడైనా ఓ భారీ వృక్షం కనిపిస్తే వెంటనే సెల్ఫీలతో సందడి చేయడం పరిపాటిగా మారింది. ఇలాంటి అరుదైన భారీ వృక్షాలు ఆత్మకూరుతో పాటు ఇదే మండలం మదిగుబ్బ గ్రామంలో కనువిందు చేస్తున్నాయి. శతాబ్దాల నాటి మర్రి చెట్లు ఊడలు దిగి అటుగా వెళుతున్న వారికి ఆహ్లాదాన్ని పంచుతున్నాయి. వేసవిలో గ్రామస్తులు చాలా మంది ఆ మర్రి చెట్ల కిందనే సేద తీరుతుంటారు.
గంగిగోవు పాలు గరిటైడెనను చాలు ... అని లోకానికి ఎలుగెత్తి చాటిన వేమన... ఇప్పటి పరిస్థితులను ఆనాడే అంచనా వేసి ఉంటే ’గరిటైడెనను చాలు ఖరము పాలు’ అంటూ పద్యాన్ని తిరగ రాసేవారేమో. ఎందుకంటే, గరిటెడు గాడిద పాల ధర కడివెడు గంగిగోవు పాల ధర కంటే ఎక్కువే మరి. తెలంగాణలోని ఆదిలాబాద్‌కు చెందిన ఓ కుటుంబం తాడిపత్రిలో గత కొన్ని రోజులుగా గాడిద పాలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది. గాడిద పాలను తాగడం ద్వారా చాలా వ్యాధులు దూరమవుతాయని చాలా మంది నమ్ముతున్నారు. చిన్నారులకు గాడిద పాలు పట్టిస్తే జీర్ణశక్తి మెరుగుపడుతుందని నమ్మకం. దీంతో 100 ఎం.ఎల్. గాడిద పాలను రూ.100 చెల్లించి కొనుగోలు చేస్తున్నారు. ఈ లెక్కన రోజూ రూ.వెయ్యి వరకు ఆదాయం ఉంటోందని ఆదిలాబాద్‌కు చెందిన రేఖ అంటున్నారు.
– తాడిపత్రి రూరల్
Comments
Please login to add a commentAdd a comment