యల్లనూరు: విద్యుత్ షాక్‌కు గురై ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... యల్లనూరు మండలం దుగ్గుపల్లికి చెందిన ఉలవల కిరణ్ (21) ఎలక్రిషీయన్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో మంగళవారం గొడ్డుమర్రికి చెందిన శివ ఇంట్లో వైరింగ్ పనుల్లో నిమగ్నమై ఉన్నప్పుడు ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు వెంటనే సమీపంలోని పులివెందులలో ఉన్న ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment