యువతలో నైపుణ్యాన్ని పెంపొందించాలి
అనంతపురం అర్బన్:‘యువతలో నైపుణ్యాభివృద్ధి పెంపొందించడం ద్వారానే ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించవచ్చు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ‘సంకల్ప’, ‘పీఎం విశ్వకర్మ’ పథకాల కింద విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలి’ అని కలెక్టర్ వి.వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళ వారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా నైపుణ్య కమిటీ (డీఎస్‌సీ) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతలో నైపుణ్యాభివృద్ధికి ప్రణాళిక ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘సంకల్ప’ ద్వారా యువతకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్రాల సంఖ్య పెంచాలని చెప్పారు. శిక్షణ తరువాత ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్‌మేళాలు నిర్వహించాలన్నారు. మెరుగైన సమాచారం కోసం డీఎస్‌సీ (డిస్ట్రిక్ట్ స్కిల్ కమిటీ ) సభ్యులు వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఆటోమోటివ్, మైనింగ్ రంగాల కోసం సమగ్ర శిక్షణ కోర్సులను నిర్వహించాలని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ బి.వినూత్న, డీఆర్‌డీఏ పీడీ ఈశ్వరయ్య, నైపుణాభివృద్ధి అధికారి ప్రతాప్‌రెడ్డి, జిల్లా ఉపాధి కల్పనాధికారి కళ్యాణి, సాంఘిక సంక్షేమ శాఖ జేడీ ప్రతాప్ సూర్యనారాయణరెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీధర్, గిరిజన సంక్షేమ శాఖాధికారి రామాంజనేయులు, ఇతర అధికారులు, పాలిటెక్నిక్, ఐటీఐ ప్రిన్సిపాళ్లు, ఆర్‌డీటీ, కియా కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
రైతు శ్రేయస్సే లక్ష్యంగా రుణం..
రైతుల ఆర్థిక శ్రేయస్సే లక్ష్యంగా పంట రుణ పరిమితి ఉండాలని కలెక్టర్ వినోద్‌కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో జిల్లాస్థాయి సాంకేతిక కమిటీ సమావేశం నిర్వహిచంఆరు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని బ్యాంకుల ద్వారా ఖరీఫ్– 2025, రబీ..2025–26లో వివిధ పంటలకు సంబంధించి రుణ పరిమితిని నిర్ణయించామన్నారు. కార్యక్రమానికి ఏడీసీసీ బ్యాంక్ సీఈఓ సురేఖరాణి కన్వీనర్‌గా వ్యవహరించారు. సమావేశంలో ఎల్‌డీఎం నర్సింగరావు, నాబార్డ్, వ్యవసాయ, ఉద్యాన, మత్స్య, సరికల్చర్, పశుసంవర్ధక శాఖ, ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
విస్తృతంగా అవగాహన కల్పించాలి
కలెక్టర్ వినోద్‌కుమార్ ఆదేశం
Comments
Please login to add a commentAdd a comment