జిల్లాకు 24న ప్రాథమిక విద్య కమిషనర్ రాక
అనంతపురం ఎడ్యుకేషన్: పాఠశాల విద్య కమిషనర్ విజయరామరాజు ఈనెల 24న జిల్లాలో పర్యటించనున్నారు. ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలల విధానంపై సమీక్షించనున్నారు. జేఎన్టీయూ ఆడిటోరియంలో ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో మంగళవారం స్థానిక పంగల్‌రోడ్డులోని ఆర్డీటీ అంధ విద్యార్థుల పాఠశాలలోని ఆడిటోరియంలో ఉమ్మడి జిల్లాలోని మండల విద్యాశాఖ అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల విద్యాశాఖ అధికారులు ప్రసాద్‌బాబు, కిష్టప్ప, సమగ్ర శిక్ష ఏపీసీలు శైలజ, దేవరాజు, డీసీఈబీ కార్యదర్శులు గంధం శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, డీవైఈఓలు శ్రీనివాసరావు, శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఈఓలు మాట్లాడుతూ కమిషనర్ నిర్వహించే సమీక్షకు అన్ని వివరాలతో హాజరుకావాలని ఆదేశించారు. ముఖ్యంగా పంచాయతీ మోడల్ ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి అన్ని వివరాలు ఉండాలన్నారు. పూర్తిగా అవగాహన కల్గి ఉండాలని సూచించారు. కమిషనర్ ర్యాండమ్‌గా స్కూళ్ల గురించి ఆరా తీస్తారన్నారు. ఉమ్మడి జిల్లాలోని డీవైఈఓలు, ఎంఈఓలు, మోడల్ ప్రైమరీ పాఠశాలల హెచ్ఎంలు, సీఆర్టీలు తప్పకుండా హాజరుకావాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment