అనంతపురం: మద్యం పాలసీలో భాగంగా గీత కార్మికులకు మద్యం విక్రయ దుకాణాలు కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ ముఖేష్‌కుమార్ మీనా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. తాటి తాగు సంప్రదాయ వృత్తిలో కొనసాగుతున్న బీసీ–ఏ కేటగిరిలోని యాట ఉపకులం, బీసీ–బీ కేటగిరిలోని గౌడ్, ఈడిగ, గాండ్ల (గమ్మల), కలాలే, గౌండ్ల, శ్రీశయన (సేగిడి) వారు అర్హులుగా పేర్కొన్నారు. జిల్లాలో ప్రత్యేకించి బీసీ–బీ కేటగిరిలోని ఈ ఉప కులాలకు చెందిన వారికి మొత్తం 14 మద్యం షాపులు కేటాయించారు. ఇందులో గౌడ్–2, ఈడిగ–9, గౌడ–1, కలాలే–1, గౌండ్ల–1 చొప్పున దుకాణాలు కేటాయించగా... అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే శ్రీసత్యసాయి జిల్లాకు సంబంధించి గౌడ్–1, ఈడిగ–7, గౌడ–1 చొప్పున మొత్తం 9 మద్యం దుకాణాలను కేటాయించారు. 2026 సెప్టెంబర్ 30వ తేదీ వరకూ వీరికి మద్యం విక్రయ లైసెన్స్‌లు జారీ చేస్తారు. ఒకరికి ఒక లైసెన్స్ మాత్రమే ఇస్తారు. దుకాణాల వార్షిక లైసెన్స్ ఫీజు సాధారణ దుకాణాలతో పోల్చుకుంటే 50 శాతం తక్కువగా ఉంటుంది. ఇందుకు సంబంధించి ఈ నెల 27న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి, ఫిబ్రవరి 5వ తేదీలోపు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ లేదా హైబ్రిడ్ విధానంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఫిబ్రవరి 7న జిల్లా కలెక్టర్ల సమక్షంలో లాటరీ పద్ధతిలో అర్హులను ఎంపిక చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment