సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా నిర్ధారణ పరీక్షలు జోరుగా సాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,710 నమూనాలు పరీక్షించగా.. 8,096 పాజిటివ్‌గా నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,09,558 కు చేరింది. తాజా పరీక్షల్లో 30,530 ట్రూనాట్ పద్ధతిలో, 44,180 ర్యాపిడ్ టెస్టింగ్ పద్ధతిలో చేశారు. కోవిడ్ బాధితుల్లో కొత్తగా 67 మంది మృతి చెందడంతో మొత్తం మృతుల సంఖ్య 5244 కు చేరింది.
గత 24 గంటల్లో 11,803 మంది కోవిడ్ రోగులు కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్చ్ అయ్యారు. ఇప్పటివరకు కోలుకున్నవారి మొత్తం సంఖ్య 5,19,891. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 84,423. ఈమేరకు ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. ఇప్పటివరకు 49 లక్షల 59 వేల 81 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశామని తెలిపింది.
(చదవండి: కరోనా ఎఫెక్ట్: 60 లక్షల ఉద్యోగులకు ఉద్వాసన)
Comments
Please login to add a commentAdd a comment