సాక్షి, పశ్చిమ గోదావరి: ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమావేశంలో వైద్యారోగ్యశాఖ మంత్రి ఆళ్లనాని, జిల్లా కలెక్టర్ రేవు ముత్యాల రాజు, జాయింట్ కలెక్టర్ హిమాన్షూ శుక్లా, ఆర్డీవో పనబాక రచన, డీఎంహెచ్వో డాక్టర్ సునంద పాల్గొన్నారు. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసిస్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) టీం సభ్యులు, పలు ప్రాంతాల నుంచి వైద్యనిపుణులు, సైంటిస్టులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరు అయ్యారు. ఈ మేరకు ఏలూరులోని ప్రస్తుత పరిస్థితులపై సీఎం జగన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. చదవండి: ఏలూరు బాధితులకు సీఎం జగన్ బాసట
ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై త్వరగా నివేధిక ఇవ్వాలని కోరారు. శుక్రవారానికి ప్రాధమిక నివేదిక ఇస్తామని ఎన్ఐఎన్ సైంటిస్టులు తెలిపారు. ఈ రోజు ఏలూరులో పర్యటిస్తున్న కేంద్ర వైద్య నిపుణులతో సీఎం జగన్ మాట్లాడారు. ఈ సందర్భంగా టువంటి సాంపిల్స్ సేకరించారు, ప్రాధమికంగా ఇప్పటికే వచ్చి ఎయిమ్స్ నివేదిక గురించి చర్చించారు. ఇప్పటి వరకు అస్వస్థతతో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి 585 మంది చేరగా.. 503 మంది ఆరోగ్యం నిలకడగా ఉండటంతో వైద్యులు డిశ్చార్జి చేశారు. ఇంకా 82 మందికి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 32 మందిని మెరుగైన వైద్య చికిత్స కోసం విజయవాడ,గుంటూరు తరలించారు.
కాగా ఏలూరులో అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. అదే విధంగా ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాసటగా నిలిచారు. అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: ఏలూరు: అస్వస్థత కేసులు తగ్గుముఖం
మరోవైపు ఏలూరు టూటౌన్‌లో మంత్రి ఆళ్లనాని పర్యటిస్తున్నారు. అస్వస్థత ప్రభావిత ప్రాంతాల్లో శానిటేషన్ పనులను పరిశీలించారు. స్థానిక ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టిందన్నారు. గుంటూరు, రాజమండ్రి నుంచి స్పెషలిస్టులను రప్పించామని తెలిపారు. ప్రస్తుతం 72 మంది చికిత్స పొందుతున్నారన్నారు. ఇతర ప్రాంతాల నుంచి నిపుణులను తీసుకువచ్చామని, వారి పర్యవేక్షణలో చికిత్స జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి నేరుగా వచ్చి తమకు దిశానిర్దేశం ఇచ్చారని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు రాజకీయ బురద జల్లేందుకు యత్నిస్తున్నారని మండిప్డారు. చంద్రబాబు నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు.
చంద్రబాబు పనికిమాలిన లేఖ రాశారు
‘ఇలాంటి సమయంలో చంద్రబాబు నాయుడు వైఖరి అత్యంత దురదృష్టకరం. నీచ రాజకీయాలకు పాల్పడుతూ ఇంకా నీచమైన విమర్శలకు దిగుతున్నారు. కరోనా సమయంలో హైదరబాద్‌లో గోళ్లు గిలుకుంటు కుర్చుని ముఖ్యమంత్రి ఏమి చేస్తున్నారు. ఆరోగ్య శాఖ మంత్రి ఏమి చేస్తున్నారు అని మాట్లాడటం ప్రజలకు సేవలకందించే కార్యక్రమాలు అడుకునేవిధంగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులో ప్రజలకు సేవలందించే పనిలో నిమగ్నమై ఉంటే బ్లీచింగ్ పౌడర్ లో జగన్ మోహన్ రెడ్డి బందువు అవినీతి జరిగిందంటూ నీచమైన రాజకీయంగా బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు.ఈ ఘటనపై సలహాలు ఇవ్వలసింది పోయి ప్రజల ఆరోగ్యం పట్ల అత్యంత నిర్లక్ష్యం గా రాజకీయాలు చేస్తున్నారు.
ఏలూరు వింత వ్యాధికి కారణలు ఏమిటనేదానిపై కేంద్ర బృందాలు నిమగ్నమయ్యాయి. ఇప్పటికే సాంపిల్స్ సేకరించారు. వాటిపైన అధ్యయనం చేసి నివేదికలు ఇవ్వనున్నారు. చంద్రబాబు నాయుడికి ఎన్నిసార్లు చెప్పిన చేవిటి వాడి ముందు శంకం ఊదినట్లే. ఇంకా ఆయన వ్యాఖ్యలు మేము పట్టించుకోము. మేము ఇంత చర్యలు తీసుకుంటు శానిటేషన్ పనులు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటే ఈ రోజు చంద్రబాబు పనికిమాలిన లేఖ రాశారు. త్రాగునీరు,డ్రైనేజి వ్యవస్థ క్షేత్ర స్దాయిలో పరిశీలిస్తున్నాం. ఈ రోజు ఉదయమే చంద్రబాబు కు మేలుకువ వచ్చింది. ఆయన పుత్రరత్నం పంపించారు, ఆయన వచ్చి పైపై పరామర్శలు చేసి హైదరాబాద్ వెళ్లి కూర్చున్నారు. ఇప్పుడు నిద్రలేచి కేసులు తగ్గుముఖం పట్టడంతో కాబట్టి ఏదో విధంగా అడుకోవాలని నీచ రాజకీయాలకు అంతులేదు. చంద్రబాబు విమర్శలపై ప్రజలు మండిపడుతున్నారు. ఏలూరులో కేసులు తగ్గుముఖం పడుతున్నాయి, ఎవరూ ఆందోళన చెందనవసరం లేదు.’ అని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment