– 14 గంటల్లో ఛేదించిన పోలీసులు
రాజంపేట : పట్టణంలో శనివారం ఎర్రబల్లికి చెందిన 7వ తరగతి విద్యార్థిని తర్షప్రియ అదృశ్యం కేసును పోలీసులు 14 గంటల్లో ఛేదించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న ఎస్ఐ భక్తవత్సలం తమ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీ కెమెరాలను పరిశీలించి కడప పాతబస్టాండ్‌లో బాలికను గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. కాగా బాలిక మార్కులు తక్కువ వచ్చాయని ఉదయం ఇంటి నుంచి పారిపోయింది. దీంతో బాలిక అదృశ్య సంఘటన పట్టణంలో కలకలం రేపింది. బాలికను సకాలంలో పట్టుకొని తల్లిదండ్రులకు అప్పగించడంతో పలువురు పోలీసులను అభినందించారు.
కృష్ణా జలాలు పరిశీలించిన లోకాయుక్త
బి.కొత్తకోట : శ్రీ సత్యసాయి జిల్లా నుంచి పుంగనూరు ఉప కాలువలో ప్రవహిస్తున్న కృష్ణా జలాలను లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి శనివారం పరిశీలించారు. బి.కొత్తకోట సమీపంలోని బూర్లపల్లె క్రాస్ వద్ద కాలువలో ప్రవహిస్తున్న నీటిని చూసి అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కరువు ప్రాంతమైన తంబళ్లపల్లె నియోజకవర్గానికి కృష్ణా జలాలు వరమని, రైతుల కష్టాలు తీరుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment