హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కార్తీకం. ఏటా దీపావళి మరుసటి రోజు నుంచే కార్తీక మాసం ప్రారంభమవుతుంది. అయితే ఈ ఏడాది అమావాస్య గురువారం సాయంత్రం ప్రారంభమై శుక్రవారం సాయంత్రం వరకు ఉండటంతో.. శనివారం నుంచి ఆరంభం కానుంది. నెల రోజుల పాటు ప్రజలు నియమనిష్టలు, అత్యంత భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించనున్నారు.
– రాజంపేట టౌన్
దీపావళి.. ఆనందాలకేళి
చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దీపావళి జరుపుకొంటారు. దీపావళి అంటే దీపాల పండుగ. చీకటిని పారదోలి వెలుగు నింపే వేడుక. పిల్లలు, పెద్దలు అందరూ కలిసి ఈ పర్వదినాన్ని జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా జరుపుకొన్నారు. టపాసులు కాల్చి ఆనంద భరితులయ్యారు. చిన్నారులు, యువకులు నాలుగైదు రోజుల ముందు నుంచే నిర్వహించిన వేడుకలు శుక్రవారం ముగిశాయి.
– సిద్దవటం
Comments
Please login to add a commentAdd a comment