బి.కొత్తకోట: బి.కొత్తకోట వ్యవసాయ మార్కెట్ యార్డుకు వస్తున్న టమాట ఐదు రాష్ట్రాలకు ఎగుమతి అవుతోంది. రెండు నెలల క్రితం మార్కెట్‌లో టమాట క్రయ విక్రయాలు మొదలయ్యాయి. పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట మండలాలు, సరిహద్దులోని కర్ణాటక ప్రాంతం నుంచి టమాట విక్రయానికి వస్తోంది. ఈ టమాటను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు రోజూ తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, ఒడిస్సా, గుజరాత్ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లె మార్కెట్ కమిటీ నుంచి బి.కొత్తకోటను వేరు చేయించారు. మదనపల్లె కమిటీ పరిధిలోని కురబలకోటను కలిపి బి.కొత్తకోట మార్కెట్ కమిటీని ఏర్పాటు చేయించారు. దీనితో ప్రస్తుతం రైతులకు ఎంతో ఉపయోగపడుతోంది.
4 నుంచి సెమిస్టర్ల పరీక్షలు
వైవీయూ: యోగివేమన విశ్వవిద్యాలయ పరిధి లోని బీఈడీ కళాశాలల 2, 4 సెమిస్టర్ల విద్యార్థులకు ఈనెల 4వ తేదీ నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలోని16 కేంద్రాలను సిద్ధం చేశామని, 16,900 మంది విద్యార్థులు హాజరవుతున్నారన్నారు. పరీక్షా కేంద్రాల పర్యవేక్షణకు అబ్జర్వర్లతో పాటు హైపవర్ కమిటీలను ఏర్పాటు చేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment