ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించాలి
కలెక్టర్ శ్రీధర్ చామకూరి
కలికిరి: ఇళ్ల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి హౌసింగ్ అధికారులు, సిబ్బందిని ఆదేశించారు. మండల పర్యటనలో భాగంగా గురువారం ఉదయం కలికిరి రెడ్డివారిపల్లి–1 హౌసింగ్ లేఅవుట్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా కాలనీలో మంజూరైన గృహాలు, నిర్మాణ దశలో ఉన్న, పూర్తిగా ప్రారంభించని గృహాల వివరాలపై ఆరా తీశారు. నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాల ని, అవసరమైన వారికి ఐకేపీ ద్వారా రుణాలు మంజూ రు చేయించాలన్నారు. అంతకు ముందు మండల పరిషత్ కార్యాలయంలో మండలంలోని హౌసింగ్ లే అవుట్ వారిగా ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లతో సమీక్షించారు. ఇండ్ల నిర్మాణాలపై హౌసింగ్ సిబ్బందితో ప్రతి రోజూ సమీక్షించాలని ఎంపీడీఓను ఆదేశించారు. విద్యార్థులకు అపార్ ఐడీ, నవశకం పోర్టల్‌లో బ్యాంక్ ఖాతా, ఆధార్ లింకేజీ, స్కిల్ సెన్సెస్ తదితరాలపై కలెక్టరు సమీక్షించారు. కార్యక్రమంలో మదనపల్లి ఆర్డీఓ రాఘవేంద్ర, హౌసింగ్, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, డీపీఓ బలరామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, ఎంపీడీఓ భానుమూర్తి, డీటీ నవీన్, ఎంఈఓ కరీముల్లా పాల్గొన్నారు.
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వద్దు
సంబేపల్లె: ప్రభుత్వ పథకాల అమలులో వేగం పెంచాలని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం, అలసత్వం పనికిరాదని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి అధికారులను ఆదేశించారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పీజీఆర్‌ఎస్ దరఖాస్తులపై సమీక్షించారు. అపార్ ఐడీ ప్రగతిపై ఆరా తీశారు. మండల కేంద్రంలోని అంగన్‌వాడీ ప్రీ స్కూల్‌ను తనిఖీ చేశారు. మోటకట్ల, ప్రకాష్‌కాలనీలో రెవిన్యూకు సంబంధించి పలు సమస్యలపై ఆయన ఆరా తీశారు. యర్రగుంట్ల సమీపంలో నూతనంగా వేసిన సీసీ రోడ్ల నాణ్యతను పరీక్షించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్‌డీఓ శ్రీనివాసులు, డ్వామా పీడీలు శివయ్య, వెంకటరత్నం, ఎంపీడీఓ రామచంద్ర, తహశీల్దార్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
సోలార్ ప్యానళ్ల ఏర్పాటును ప్రోత్సహించాలి
రాయచోటి: జిల్లా వ్యాప్తంగా పీఎం సూర్యఘర్ పథ కం కింద ఇండ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటును ప్రో త్సహించాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో సూర్యఘర్ అమలుపై జిల్లాస్థాయి కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇప్ప టి వరకు మొత్తం 837 మంది ఈ పథకం కింద దర ఖాస్తు చేసుకున్నారని అధికారులు కలెక్టర్‌కు వివరించారు. ఈ సమావేశంలో ఏపీడీసీఎల్ ఎస్‌ఈ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ సీఈఓ ఓబులమ్మ, నెడ్ గ్యాప్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ఎల్లారెడ్డి, డీఈ, ఏఈలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment