ప్రకృతి వ్యవసాయంతో కరువు నివారణ చర్యలు
రాయచోటి : బీడు భూములలో ప్రకృతి వ్యవసాయం ద్వారా జిల్లాలో కరువు నివారణ చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ అన్నారు. శనివారం రాయచోటిలో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి జిల్లాలో ఐదురోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి ప్రారంభించారు. జిల్లాలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న రైతులు తప్పకుండా ఈ పంటలో నమోదు చేసుకోవాలన్నారు. అలాగే బీడు భూముల్లో ప్రకృతి వ్యవసాయం కరువు నివారణ మోడల్‌లను అవలంబించాలని సూచించారు. రైతులకు వివరించి ఈ మోడల్ వేయించే దిశగా సిబ్బంది కృషి చేయాలని తెలియజేశారు. ప్రకృతి వ్యవసాయంలో భాగమైన ఘనజీవామృతం, ద్రవజీవామృతం, జీవ ఉత్పేరకాలు ఎక్కువ మోతాదులో రైతులతో తయారు చేయించి సాగుకు వినియోగించేలా చూడాలని డీపీఎం ప్రవీణ్ కుమార్ తెలియజేశారు. జిల్లాలో 30 మండలాల నుంచి 50 మంది సిబ్బందిని 8 బ్యాచ్‌లుగా నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రకృతి వ్యవసాయంలో ఉన్న విజ్ఞానాన్ని పొందాలని సూచించారు. సమావేశంలో ఎంటీ యూనిట్ ఇన్‌చార్జ్, ఐసీఆర్‌పీ, డీపీఏం ఆఫీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
జిల్లా వ్యవసాయ అధికారి చంద్ర నాయక్
Comments
Please login to add a commentAdd a comment