ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం, ఆస్తిలాభం | Daily Horoscope In Telugu On 23 August 2024 | Sakshi
Sakshi News home page

ఈ రాశి వారికి చేపట్టిన పనుల్లో విజయం, ఆస్తిలాభం

Published Fri, Aug 23 2024 6:59 AM | Last Updated on Fri, Aug 23 2024 8:22 AM

Daily Horoscope In Telugu On 23 August 2024

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.చవితి ప.3.24 వరకు, తదుపరి పంచమి, నక్షత్రం: రేవతి రా.1.31 వరకు, తదుపరి అశ్విని, వర్జ్యం: ప.2.24 నుండి 3.52 వరకు, తదుపరి రా.7.57 నుండి 9.29 వరకు, దుర్ముహూర్తం: ఉ.8.18 నుండి 9.06 వరకు, తదుపరి ప.12.29 నుండి 1.17 వరకు, అమృతఘడియలు: రా.11.21 నుండి 12.50 వరకు.

సూర్యోదయం :    5.47
సూర్యాస్తమయం    :  6.19
రాహుకాలం : ఉ.10.30
నుండి 12.00 వరకు
యమగండం :  ప.3.00 నుండి 4.30 వరకు 

మేషం: కుటుంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్రమైన సంఘటనలు. బంధువుల కలయిక. పనుల్లో స్వల్ప ఆటంకాలు. వృత్తి, వ్యాపారాలు కొంత ఇబ్బందికరంగా ఉంటాయి.

వృషభం: మిత్రులతో వివాదాలు సర్దుబాటు కాగలవు. ఆర్థిక లావాదేవీలు ఉత్సాహవంతంగా ఉంటాయి. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి.

మిథునం: కుటుంబంలో శుభకార్యాలు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. బంధువుల నుంచి కీలక సమాచారం. ఆస్తిలాభం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు.

కర్కాటకం: నిర్ణయాలు మార్చుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆకస్మిక ప్రయాణాలు. విద్యార్థులకు ఒత్తిడులు.వ్యాపార, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.

సింహం: ఆదాయానికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య సమస్యలు. వృత్తి, వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.

కన్య: చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. పండితగోష్ఠులలో పాల్గొంటారు. పనులు చకచకా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

తుల: దూరపు బంధువుల కలయిక. ఇంటాబయటా అనుకూలం. కొత్త విషయాలు తెలుసుకుంటారు. పలుకుబడి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: బంధువుల తాకిడి పెరుగుతుంది. పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.

ధనుస్సు: ఎంతగా శ్రమించినా ఫలితం ఉండదు. పనుల్లో ఆటంకాలు. రాబడికి మించి ఖర్చులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిళ్లు.

మకరం: శుభకార్యాలకు హాజరవుతారు. విద్యార్థులు సత్తా చాటుకుంటారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారులకు ఆశాజనకం. ఉద్యోగస్తులకు పదోన్నతులు.

కుంభం: పనులు మధ్యలో నిలిపివేస్తారు. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నిరాశ కలిగిస్తాయి.

మీనం: రుణాలు తీరి ఊరట చెందుతారు. వ్యవహారాలలో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement