Horoscope Today: ఈ రాశి వారు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు | Daily Horoscope On 24 August 2024 In Telugu | Sakshi
Sakshi News home page

Horoscope Today: ఈ రాశి వారు కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు

Published Sat, Aug 24 2024 6:38 AM | Last Updated on Sat, Aug 24 2024 8:38 AM

Daily Horoscope On 24 August 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు  శ్రావణ మాసం, తిథి: బ.పంచమి ప.12.58 వరకు తదుపరి షష్ఠి, నక్షత్రం: అశ్వని రా.11.55 వరకు తదుపరి భరణి, వర్జ్యం: రా.8.12 నుండి 9.40 వరకు, దుర్ముహూర్తం: ఉ.5.41 నుండి 7.25వరకు,అమృతఘడియలు: సా.5.17 నుండి 6.47 వరకు. 

మేషం: కొత్త పనులు చేపడతారు. ఆత్మీయులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆలయ దర్శనాలు. బంధువుల నుంచి ఆహ్వానాలు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో లక్ష్యాలు సాధిస్తారు.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యయప్రయాసలు. బంధువులతో మాటపట్టింపులు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మిథునం: శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. సన్నిహితులతో సఖ్యత. గృహయోగం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత.

కర్కాటకం: మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. వాహనాలు, ఆభరణాలు కొంటారు. స్థిరాస్తి లాభం. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో శ్రమ ఫలిస్తుంది.

సింహం: ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా కొనసాగుతాయి.

కన్య: పనుల్లో అవాంతరాలు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. బంధువులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో కొన్ని సమస్యలు.

తుల: వ్యవహారాలలో మరింత అనుకూలత. స్థిరాస్తి వృద్ధి. బంధువుల రాక ఉత్సాహాన్నిస్తుంది. వాహనసౌఖ్యం. ఉద్యోగలాభం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితులు.

వృశ్చికం: నూతన ఉద్యోగాలు దక్కించుకుంటారు. పరిచయాలు పెరుగుతాయి. ఆశ్చర్యకరమైన సంఘటనలు. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిభ చాటుకుంటారు.

ధనుస్సు: బంధువులు, మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణాలు చేస్తారు. అనారోగ్యం. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

మకరం: కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలు రద్దు. బంధువులతో తగాదాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

కుంభం: కొత్త వ్యూహాలతో ముందుకు సాగుతారు. విద్యార్థులకు శుభవార్తలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. దైవచింతన. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు ఫలిస్తాయి.

మీనం: కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. పనులు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు.
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement