ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు | Today Telugu Horoscope On October 4th, 2024: Know Astrological Predictions Of Your Zodiac Signs In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope In Telugu: ఈ రాశి నిరుద్యోగులకు శుభవార్తలు

Published Fri, Oct 4 2024 7:00 AM | Last Updated on Fri, Oct 4 2024 9:08 AM

Horoscope Today: Rasi Phalalu October 04 In Telugu

మేషం....ఆర్థిక సమస్యలు తీరి ఉపశమనం కలుగుతుంది. దూరపు బంధువుల నుండి శుభవర్తమానాలు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. వస్తులాభాలు. వృత్తులు, వ్యాపారాలు సజావుగా కొనసాగుతాయి.

వృషభం... సన్నిహితులతో సఖ్యత. ఇంటాబయటా ప్రోత్సాహం. విందువినోదాలు. కార్యజయం. చిన్ననాటి విషయాలు గుర్తుకు తెచ్చుకుంటారు. వృత్తులు, వ్యాపారాలలో ఆటుపోట్లు తొలగుతాయి.

మిథునం....సేవాకార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయులతో  వివాదాలు. స్వల్ప అనారోగ్యం. లేనిపోని ఖర్చులు తప్పవు. దూరప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.

కర్కాటకం.... ఎంత కష్టించినా ఫలితం కనిపించదు. ఆస్తుల వివాదాలు. ఆకస్మిక ప్రయాణాలు. రుణఒత్తిడులు. ఆరోగ్యం మందగిస్తుంది. వృత్తులు, వ్యాపారాలలో చికాకులు.

సింహం.... పరిచయాలు విస్తృతమవుతాయి. ఆర్థికంగా మరింత బలం చేకూరుతుంది. ఆస్తి విషయంలో అగ్రిమెంట్లు. భూములు, వాహనాలు కొంటారు. వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.

కన్య.... రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ఆరోగ్యం సహకరించదు. బాధ్యతలతో ఉక్కిరిబిక్కిరి కాగలరు. వృత్తులు, వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి.

తుల.... కొత్త వ్యక్తుల పరిచయాలు. సమాజంలో ప్రత్యేక గుర్తింపు. రావలసిన డబ్బు అందుతుంది. ఏ పని చేపట్టినా సమయానికి పూర్తి. వృత్తులు, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి.

వృశ్చికం.. రుణదాతల నుండి ఒత్తిడులు. ప్రయాణాలు వాయిదా వేస్తారు. సోదరులు, మిత్రులతో విభేదాలు. పనులు ముందుకు సాగవు. వృత్తులు, వ్యాపారాలలో ఇబ్బందులు.

ధనుస్సు... నిరుద్యోగులకు శుభవార్తలు. పరిస్థితులు అనుకూలిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆప్తుల సలహాలు పొందుతారు. వృత్తులు, వ్యాపారాలు మరింత అనుకూలిస్తాయి.

మకరం.... గతం నుండి వేధిస్తున్న సమస్య పరిష్కారం. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది.  వృత్తులు, వ్యాపారాలను క్రమపద్దతిలో నడిపిస్తారు. దైవదర్శనాలు.

కుంభం.... అప్పులు చేస్తారు. దూరప్రయాణాలు. కుటుంబంలో కొత్త సమస్యలు. ఆప్తులతో కలహాలు. మానసిక ఆందోళన. వృత్తులు, వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి.

మీనం....ఆర్థికంగా గందరగోళంలో పడతారు. మీ ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటుంబబా««ధ్యతలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. వృత్తులు, వ్యాపారాలు మందగిస్తాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement