ఈ రాశివారు కష్టాలు అధిగమిస్తారు.. అంచనాలు నిజమవుతాయి | Horoscope Today: Rasi Phalalu October 02 In Telugu | Sakshi
Sakshi News home page

Today Horoscope: ఈ రాశివారు కష్టాలు అధిగమిస్తారు.. అంచనాలు నిజమవుతాయి

Published Wed, Oct 2 2024 7:09 AM | Last Updated on Wed, Oct 2 2024 8:55 AM

Horoscope Today: Rasi Phalalu October 02 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, తిథి: అమావాస్య రా.10.45 వరకు, తదుపరి ఆశ్వయుజ మాస శుక్ల పాడ్యమి, నక్షత్రం: ఉత్తర ప.12.24 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: రా.9.43 నుండి 11.27 వరకు, దుర్ముహూర్తం: ఉ.11.28 నుండి 12.16 వరకు, అమృత ఘడియలు: లేవు, మహాలయ అమావాస్య; రాహుకాలం: ప.12.00 నుండి 1.30 వరకు, యమగండం: ఉ.7.30 నుండి 9.00 వరకు, సూర్యోదయం: 5.54, సూర్యాస్తమయం: 5.48.

మేషం: పరిచయాలు పెరుగుతాయి. పనుల్లో విజయం. ఆప్తుల సలహాలు స్వీకరిస్తారు. సంఘంలో గౌరవం.  వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.  మిత్రులతో వివాదాల పరిష్కారం.

వృషభం: వ్యయప్రయాసలు. పనుల్లో స్వల్ప ఆటంకాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నిరాశ.

మిథునం: రుణయత్నాలు ముమ్మరం చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. పనుల్లో అవాంతరాలు. బంధువులు, మిత్రుల నుంచి సమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరిన్ని బాధ్యతలు.

కర్కాటకం: సంఘంలో గౌరవం. విలువైన సమాచారం అందుతుంది. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో అవాంతరాలు తొలగుతాయి.

సింహం: మిత్రులతో మాటపట్టింపులు. దూరప్రయాణాలు. పనుల్లో కొంత జాప్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో  గందరగోళం.

కన్య: నూతన ఉద్యోగయోగం. కీలక నిర్ణయాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. విందువినోదాలు. ప్రముఖులతో పరిచయాలు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

తుల: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ప్రయాణాలలో మార్పులు. ధనవ్యయం. కుటుంబసభ్యులతో విభేదాలు.  ఆరోగ్యభంగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు తప్పవు.

వృశ్చికం: నూతన వ్యక్తుల పరిచయం. శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల నుంచి ధనలాభం. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం.

ధనుస్సు: చిన్ననాటి మిత్రుల నుంచి ఆహ్వానాలు. పోటీపరీక్షల్లో విజయం. విందువినోదాలు. ఆసక్తికరమైన సమాచారం. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు అధిగమిస్తారు.

మకరం: కుటుంబంలో చికాకులు. అనుకోని ప్రయాణాలు. రుణాలు చేస్తారు. బంధువులతో మాటపట్టింపులు. ఆలయాలు సందర్శిస్తారు.  వ్యాపారాలు, ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర పరిస్థితి.

కుంభం: ప్రయాణాలు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. ధనవ్యయం. కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో మార్పులు సంభవం.

మీనం: దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం. ఆస్తి, ధనలాభాలు. వాహనయోగం. విద్యావకాశాలు.  వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు నిజమవుతాయి. దైవచింతన.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement