ఈ రాశివారికి నూతన ఒప్పందాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం! | Daily Horoscope On 22 August 2024 In Telugu | Sakshi
Sakshi News home page

ఈ రాశివారికి నూతన ఒప్పందాలు, వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం!

Published Thu, Aug 22 2024 6:46 AM | Last Updated on Thu, Aug 22 2024 8:30 AM

Daily Horoscope On 22 August 2024 In Telugu

శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: బ.తదియ సా.5.52 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాభాద్ర రా.3.13 వరకు, తదుపరి రేవతి, వర్జ్యం: ప.1.50 నుండి 3.18 వరకు, దుర్ముహూర్తం: ఉ.9.58 నుండి 10.46 వరకు, తదుపరి ప.3.00 నుండి 3.48 వరకు, అమృత ఘడియలు: రా.10.47 నుండి 12.16 వరకు; రాహుకాలం: ప.1.30 నుండి 3.00 వరకు, యమగండం: ఉ.6.00 నుండి 7.30 వరకు, సూర్యోదయం: 5.47, సూర్యాస్తమయం: 6.20. 

మేషం: కుటుంబసభ్యులతో సఖ్యత. విందువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది. దైవదర్శనాలు.

వృషభం: మిత్రులతో కలహాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొంత గందరగోళం. ఉద్యోగాలలో మార్పులు.

మిథునం: ఇంటాబయటా అనుకూలం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వాహనయోగం. పలుకుబడి పెరుగుతుంది. వ్యవహారాలలో పురోగతి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కర్కాటకం:  నూతన ఉద్యోగలాభం. కార్యజయం. ఆస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. వాహనయోగం. ప్రముఖులతో పరిచయాలు. పాతమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.

సింహం:  పనుల్లో జాప్యం. ఆర్థిక విషయాలలో నిరాశ. దూరప్రయాణాలు. కుటుంబసభ్యులు మీ నిర్ణయాలను తిరస్కరిస్తారు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు సామాన్యంగా  ఉంటాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

కన్య: రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. పనులు మందకొడిగా సాగుతాయి. కుటుంబంలో చికాకులు. ఆలయాలు సందర్శిస్తారు. శ్రమాధిక్యం. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగాలలో మార్పులు.

తుల: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. వ్యవహారాలలో విజయం. నిరుద్యోగులు, విద్యార్థుల యత్నాలు సఫలం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలు ప్రగతి పథంలో సాగుతాయి.

వృశ్చికం: నిరుద్యోగులకు అనుకూలత. యత్నకార్యసిద్ధి. దూరపు బంధువుల కలయిక. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన ఒప్పందాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.

ధనుస్సు:  కుటుంబసభ్యులతో వైరం. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు నిలకడగా ఉండవు. శ్రమ మరింత పెరుగుతుంది. ఆరోగ్యం మందగిస్తుంది. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగాలలో నిరాశ.

మకరం:  రుణాలు చేస్తారు. ఆలయ దర్శనాలు. కుటుంబసభ్యులతో విభేదాలు. పనులు వాయిదా వేస్తారు. కష్టానికి ఫలితం కనిపించదు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో గందరగోళం.

కుంభం: యత్నకార్యసిద్ధి. బంధువుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. ఆస్తి వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వస్తులాభాలు. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

మీనం: ఆకస్మిక ప్రయాణాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యభంగం. విద్యార్థులకు కొంత నిరాశ. ప్రయాణాలు వాయిదా వేస్తారు. పనుల్లో ఆటంకాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement