శ్రీ క్రోధి నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, శ్రావణ మాసం, తిథి: శు.చతుర్దశి రా.2.38 వరకు తదుపరి పౌర్ణమి, నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.9.52 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ప.1.45 నుండి 3.17 వరకు, దుర్ముహూర్తం: సా.4.43 నుండి 5.31 వరకు, అమృతఘడియలు: రా.11.02 నుండి 12.34 వరకు.
మేషం..
ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయం. సన్నిహితుల సాయం పొందుతారు. జీవిత భాగస్వామి నుంచి ఆస్తి లాభం. ఇంటర్వ్యూలు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
వృషభం..
వ్యయప్రయాసలు. పనుల్లో ఆటంకాలు. భాగస్వామ్య వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు. వృథా ఖర్చులు.
మిథునం..
ఇంటాబయటా సమస్యలు. శ్రమా«ధిక్యం. స్వల్ప అనారోగ్యం. పనులు కొన్ని వాయిదా వేస్తారు. మిత్రులతో కలహాలు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగబాధ్యతలు పెరుగుతాయి.
కర్కాటకం..
దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. పనులు సజావుగా పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.
సింహం..
నిరుద్యోగులకు అనుకూల సమాచారం. విందువినోదాలు. రాబడి పెరుగుతుంది. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు హోదాలు. శుభవార్తలు.
కన్య..
కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. దూరప్రయాణాలు. ఖర్చులు అధికం. మిత్రులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.
తుల..
ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ప్రత్యర్థుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి. ఉద్యోగాలలో కొన్ని మార్పులు.
వృశ్చికం..
పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. నూతన పరిచయాలు. వాహనయోగం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి.
ధనుస్సు..
అనుకోని ప్రయాణాలు. కొత్త రుణాలు చేస్తారు. బంధువులతో విభేదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో మార్పులు. ఆలయ దర్శనాలు. పనులు ముందుకు సాగవు.
మకరం..
మీ ప్రతిభాపాటవాలు వెలుగు చూస్తాయి. సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత ఉత్సాహం.
కుంభం..
కుటుంబంలో చికాకులు. ప్రయాణాలు వాయిదా. శ్రమాధిక్యం. సోదరులతో వివాదాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం.
మీనం..
ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్లు. వ్యాపారవృద్ధి. వస్తు, వస్త్రలాభాలు.
Comments
Please login to add a commentAdd a comment