సాక్షి, విజయవాడ: ఏపీలో కూటమి ప్రభుత్వంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చంద్రబాబు కేబినెట్లో కలకలం సృష్టించినట్టు సమాచారం. ఈ క్రమంలోనే నేడు చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు.. నేటి కేబినెట్ సమావేశంలో పవన్ పాల్గొనకపోవడం మరో విశేషం.
ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ చేసిన కామెంట్స్ కూటమి సర్కార్‌లో కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ పూర్తిగా విఫలమైందని ప్రభుత్వంపై పవన్ విరుచుకుపడ్డారు. ఇదే సమయంలో హోంమంత్రి వంగలపూడి అనితను కూడా పవన్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం లుకలుకలు మొదలైనట్టు వార్తలు వినిపిస్తున్నాయి.
మరోవైపు.. సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు కేబినెట్ సమావేశం జరుగుతోంది. అయితే, చంద్రబాబు నిర్వహించే ఉన్నత స్థాయి సమావేశానికి పవన్ హాజరు కాకపోవడం గమనార్హం. డిప్యూటీ సీఎం పవన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాను పవన్ కలువనున్నారు. ఇక, పవన ఢిల్లీ పర్యటనపై చంద్రబాబు ఆరా తీసినట్టు సమాచారం.
ఇదిలా ఉండగా.. తాజాగా డిప్యూటీ సీఎం పవన్‌పై మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబును మందకృష్ణ కలిసిన తర్వాత పవన్ తీరుపై మండిపడ్డారు. పవన్ వ్యాఖ్యలు సరికాదంటూ కామెంట్స్ చేయడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment