జిల్లాలో పదింతల ఆనందం | Sakshi
Sakshi News home page

జిల్లాలో పదింతల ఆనందం

Published Tue, Apr 23 2024 8:35 AM

షేక్‌ నాగూర్‌వలి 
 జెడ్పీ, వలపర్ల (591) - Sakshi

బాపట్ల టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన పదో తరగతి పరీక్షల ఫలితాల్లో ప్రభుత్వ స్కూళ్ల విద్యార్థులు సత్తా చాట్టారు. కార్పొరేటుకు దీటుగా పోటీపడ్డారు. జిల్లాలో 336 పాఠశాలల ఉండగా ఆయా పాఠశాలల నుంచి 8497 మంది బాలురు, 8221 మంది బాలికలు కలిపి మొత్తం 16718 పరీక్షలు రాశారు. ఇందులో 7335 మంది బాలురు, 7408 మంది బాలికలు కలిసి మొత్తం 14743 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 86.32 శాతం, బాలికలు 90.01 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 88.19 శాతం ఉత్తీర్ణత నమోదైంది. బాపట్ల పట్టణంలోని శ్రీచైతన్య పాఠశాలకు చెందిన షేక్‌ రెహాన్‌ హఫీజ్‌ 595/600 మార్కులు సాధించి జిల్లా ప్రథమ స్థానంలో, పర్చూరులోని ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌కు చెందిన ఒగ్గిశెట్టి ఆక్షయ 594 మార్కులు సాధించి ద్వితీయ స్థానంలో, అద్దంకి హోలిఫెయిత్‌ స్కూల్‌కు చెందిన గాలి యశ్వంత్‌ 593 మార్కులు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు.

590 మార్కులుపైగా 30 మంది

జిల్లాలో 590 మార్కులు పైగా 30 మంది విద్యార్థులు సాధించారు. వారిలో తొమ్మిది మంది బాలురు ఉండగా, 21 మంది బాలికలే ఉన్నారు. వారిలో బాపట్లకు చెందిన మువ్వల సాయి విష్ణుశశాంక్‌ (593, శ్రీచైతన్య, బాపట్ల), కె. నిఖిత (593, శ్రీచైతన్య, చీరాల), ఎం. శ్రీముఖి(593, డ్రీమ్స్‌ హైస్కూల్‌, పోసపాడు), ఎం. శైలేశ్వరి (592, ఎంఎంఆర్‌ హైస్కూల్‌, ఇంకొల్లు), గుంటూరు వెంకటరామ నాగలక్ష్మి (592,డ్రీమ్స్‌ హస్కూల్‌, పోసపాడు), అక్కల భానుతేజరెడ్డి (592, భాష్యం, అద్దంకి), గవిని శివకుమారి (592, శ్రీచైతన్య, బాపట్ల), షేక్‌ తోహిత్‌ హుస్సేన్‌ (592, అక్షర్‌ విద్యాభవన్‌, బాపట్ల), బుర్ల నాగభువనేశ్వరి (592, శ్రీచైతన్య చీరాల), షేక్‌ నాగూర్‌వలి (591, జడ్పీ హైస్కూల్‌, వల్లపర్ల), వి. హిమజశ్రీ (591, విజ్ఞాన్‌ భారతి, చీరాల), ఎన్‌. నిఖిత (591, ఆక్స్‌ఫర్డ్‌ హైస్కూల్‌, పర్చూరు), కె. వెంకటసాయి విద్యశ్రీ (591, శ్రీచైతన్య, అద్దంకి), షేక్‌ ఫరీద్‌నిదా (591, శ్రీచైతన్య, బాపట్ల), చేబ్రోలు విజయ్‌ (591, రవీంద్రభారతి, బాపట్ల), పులుగు యశ్వంత్‌ (591, విజ్ఞానభారతి, చీరాల), కారంకి తనూజ (591, శ్రీచైతన్య, చీరాల), బి. నందిని (591, బాలయేసు స్కూల్‌, నగరం), శ్యామల తనూజ (590, ఎస్‌ఎఫ్‌ఎస్‌, స్కూల్‌, నాగులపాలెం), కోళ్లపూడి శ్రీహర్షిత (590, ఆక్స్‌ఫర్‌, పర్చూరు), పాలశెట్టి అక్షయశ్రీ (590, లిటిల్‌ ఏంజెల్స్‌, బాపట్ల), పఠాన్‌ షాలేహా (590, సందీప్‌ స్కూల్‌, చీరాల), పి. సాయి హర్షితారెడ్డి (590, చీరాల), డి. కుందన (590, డ్రీమ్స్‌ హైస్కూల్‌, ఇంకొల్లు), తాతా మహేష్‌బాబు (590, డ్రీమ్స్‌ హైస్కూల్‌, ఇంకొల్లు), పి. శ్రీవర్షిణి (590, రాయల్‌ హైస్కూల్‌, మార్చూరు), వి. నందిని (590, శ్రీచైతన్య, మార్టూరు)

61 పాఠశాలల్లో 100 శాతం ఉత్తీర్ణత

జిల్లాలో మొత్తం 336 పాఠశాలలు ఉండగా వాటిల్లో 61 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. వాటిల్లో జిల్లా పరిషత్‌ 19, ప్రైవేటు 37, గురుకుల పాఠశాల 1, ఏపీ ట్రైబల్‌ వెల్ఫేర్‌ 1, ఎయిడెడ్‌ 3 పాఠశాలలు ఉన్నాయి.

టెన్త్‌లో 88.19 శాతం ఉత్తీర్ణత 61 పాఠశాలల్లో 100 శాతం 590 పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 30 మంది ఇందులో తొమ్మిది మంది బాలురు, 21 మంది బాలికలు కార్పొరేట్‌ పాఠశాలకు దీటుగా మార్కులు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు

Advertisement
Advertisement