వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్పీ రెడ్డి | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎస్పీ రెడ్డి

Published Tue, Apr 23 2024 8:35 AM

- - Sakshi

చుండూరు (భట్టిప్రోలు): చుండూరు మండలం చినపరిమి గ్రామానికి చెందిన కొండా శివ ప్రసాద్‌ రెడ్డిని(ఎస్పీ రెడ్డి) వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈయన ప్రస్తుతం భట్టిప్రోలు మండల పరిశీలకులుగా వ్యవహరిస్తున్నారు. గతంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పని చేశారు. తన నియామకానికి కృషిచేసిన వైఎస్సార్‌ సీపీ రీజనల్‌ కో–ఆర్డినేటర్‌ ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, బాపట్ల జిల్లా సమన్వయకర్త మోపిదేవి వెంకట రమణారావు, వేమూరు ఎమ్మెల్యే అభ్యర్ధి వరికూటి అశోక్‌బాబుకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పదవిని ఇచ్చిన సీఎం జగన్‌కు ఎంతో రుణపడి ఉంటానని పేర్కొన్నారు. శాయశక్తులా పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
Advertisement