రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల విజేత శ్రీకాకుళం
పిట్టలవానిపాలెం(కర్లపాలెం): పిట్టలవానిపాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన 68వ రాష్ట్రస్థాయి అండర్–14 బాలబాలికల కబడ్డీ పోటీల్లో శ్రీకాకుళం క్రీడాకారులు గెలుపొంది విజేతలుగా నిలిచారు. గత మూడు రోజులుగా జరుగుతున్న పోటీలు సోమవారం సాయంత్రం ముగిశాయి. ఉమ్మడి 13 జిల్లాల నుంచి బాలుర విభాగంలో 13 టీమ్‌లు, బాలికల విభాగంలో 13 టీమ్‌లు పాల్గొన్నారు. లీక్, నాకవుట్ పద్ధతిలో పోటీలు జరిగాయి. ఫైనల్‌లో బాలుర విభాగంలో శ్రీకాకుళం టీమ్‌తో విజయనగరం తలపడింది. శ్రీకాకుళం విజేతగా నిలవగా విజయనగరం టీమ్ రన్నర్స్‌గా నిలిచింది. గుంటూరు బాలుర టీమ్ తృతీయ స్థానం సాధించింది. బాలికల విభాగంలో శ్రీకాకుళం టీమ్, అనంతపురం టీమ్‌లు పోటీపడగా శ్రీకాకుళం విజేతగా నిలిచింది. అనంతపురం రన్నర్స్‌గా, గుంటూరు టీమ్ తృతీయస్ధానం సాధించింది. కబాడీ పోటీల ముగింపు కార్యక్రమంలో బాపట్ల ఎమ్మెల్యే వేగేశన నరేంద్రవర్మ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. అండర్–14 రాష్ట్ర జట్టుకు బాలురు 12మంది, బాలికలు 12 మందిని ఎంపిక చేసినట్లు రాష్ట్ర స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ బాపట్ల జిల్లా కార్యదర్శి షేక్ కరీముల్లా తెలిపారు. వీరంతా త్వరలో మహారాష్ట్రలో జరిగే జాతీయ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో కేర్ విద్యా సంస్థల ప్రతినిధులు వేగేశన రాధాకృష్ణంరాజు, కిషోర్‌రాజు, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆర్గనైజర్ ప్రశాంత్‌బాబు, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు.
అండర్–14 బాలబాలికల జట్ల ఎంపిక
Comments
Please login to add a commentAdd a comment