అన్నదానం అభినందనీయం
బాపట్ల: సూర్యలంక సముద్రతీరానికి పుణ్య స్నానాలు చేసేందుకు వచ్చిన భక్తులకు అన్నదానం చేయటం అభినందనీయమని బాపట్ల జిల్లా అడిషనల్ ఎస్పీ పి.విఠలేశ్వర్ చెప్పారు. బాపట్ల అఖండ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు విన్నకోట సురేష్ సూర్యలంక తీరంలో సోమవారం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని అడిషనల్ ఎస్పీ పి.విఠలేశ్వర్ సందర్శించి భక్తులకు భోజనం వడ్డించారు. ఆయన మాట్లాడుతూ పవిత్ర కార్తికమాసంలో పుణ్యస్నానాలు చేసేందుకు సముద్రతీరానికి వచ్చిన భక్తుల ఆకలి తీర్చటం పుణ్య కార్యమని కొనియాడారు. అఖండ ఫౌండేషన్ అధ్యక్షుడు విన్నకోట సురేష్ మాట్లాడుతూ శివపార్వతుల అనుగ్రహంతో గత మూడు సంవత్సరాలుగా సముద్రతీరంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని ప్రస్తుతం 5వేల మందికి అన్నదానం చేశామని తెలిపారు. ఫౌండేషన్ సెటిలర్ కల్లం హరనాథ్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి వంగపాటి శివ, ఆడిటర్ సుబ్రమణ్యం, ఉపాధ్యక్షులు మామిడి రమేష్, చేజర్ల సతీష్, శ్యామ్‌ప్రసాద్, నాగరాజు, సుధాకర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment