మద్యం అక్రమంగా నిల్వ ఉంచితే చర్యలు
అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు
చీరాల: మద్యం అక్రమంగా నిల్వ ఉంచినా, విక్రయించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అసిస్టెంట్ ప్రొహిబిషన్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ బి.వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం ఆయన చీరాల ఎకై ్సజ్ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈసందర్భంగా స్టేషన్ పరిధిలోని మద్యం నిల్వలు, కేసుల గురించి ఎకై ్సజ్ సీఐ నాగేశ్వరరావుతో రివ్యూ సమావేశం నిర్వహించారు. మద్యం షాపులను తనిఖీ చేస్తూ మద్యం నిల్వలపై పరిశీలన చేయాలన్నారు. అలాగే అక్రమంగా మద్యం రవాణా చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం అక్రమంగా మద్యం కలిగి ఉండడం, అమ్మడం నేరమన్నారు. ఈ సందర్భంగా అధికారులుకు, సిబ్బంది సూచనలు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment