సమస్యలను సత్వరమే పరిష్కరించండి
సిబ్బందిని ఆదేశించిన ఏఎస్పీ టి.పి.విఠలేశ్వర్
బాపట్లటౌన్: సమస్యలతో పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని అడిషనల్ ఎస్పీ టి.పి. విఠలేశ్వర్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుంచి 33 మంది బాధితులు అడిషనల్ ఎస్పీను కలిసి సమస్యలు విన్నవించుకున్నారు. బాధితుల సమస్యలు తెలుసుకున్న ఏఎస్పీ జిల్లాలోని పోలీస్ అధికారులతో మాట్లాడి బాధితుల సమస్యలను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. కుటుంబ కలహాలు, అత్తారింటి వేధింపులు, ఆస్తి తగాదాలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీ మోసాలు, ఇతర పలు సమస్యలతో కూడిన అర్జీలు వచ్చాయి. సమస్యలపై త్వరితగతిన విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment