వైభవంగా వీవీఐటీ వార్షికోత్సవం
పెదకాకాని: వీవీఐటీలో సంపూర్ణ క్రమశిక్షణతో కూడిన విద్యనందిస్తున్నట్లు కళాశాల చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ అన్నారు. మండలంలోని నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాల 17వ వార్షికోత్సవం సోమవారం వైభవంగా నిర్వహించారు. వార్షికోత్సవంలో భాగంగా నిర్వహించిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం మనసులను హత్తుకుంది. చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ సంపూర్ణ క్రమశిక్షణ, సంపూర్ణ విద్య నినాదంతో విలువలతో కూడిన విద్యను అందిస్తున్నామన్నారు. కళాశాల విద్యార్థులు అన్నిరంగాలలో రాణించి విజేతలుగా ఎదగడం సంతోషం కలిగించినదన్నారు. నూతనంగా ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థుల సంఘం ద్వారా ప్రస్తుత విద్యార్థుల భవిష్యత్ ప్రణాళికలకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. అనంతరం చైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్, వైస్ చైర్మన్ వాసిరెడ్డి మహదేవ్, ప్రిన్సిపాల్ డాక్టర్ వై.మల్లిఖార్జునరెడ్డి 2023–24 విద్యా సంవత్సరంలో అత్యుత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెడల్స్‌ను అందచేశారు. ఈవిద్యాసంవత్సరంలో మెరుగైన ఉత్తీర్ణతా శాతాన్ని సాధించిన విభాగంగా కంప్యూటర్‌సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్(సీఎస్‌ఎం), అకడమిక్స్ టాపర్‌గా విద్యాయేతర (క్రీడ, సాంస్కృతిక) అంశాల్లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విభాగం కంప్యూటర్ సైన్స్– ఐఓటీ అండ్ సైబర్ సెక్యురిటీ విత్ బ్లాకై ్లన్ టెక్నాలజీ (సిఐసి) రోలింగ్ షీల్డ్‌లను దక్కించుకున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment