సేంద్రియ ఆహారంతోనే ఆరోగ్యం
గుంటూరు రూరల్: సేంద్రియ ఆహారంతోనే ఆరోగ్యంగా జీవించవచ్చని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. సోమవారం వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట నందున్న రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన తుమ్మేటి రఘోత్తమరెడ్డి రైతునేస్తం మిద్దెతోటల పురస్కారాలు–2024 కార్యక్రమంలో డీజీపీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో పాల్గొనటం సంతోషకరమన్నారు. ఇంట్లో మొక్కలు పెంచుకునే వారికి ప్రభుత్వం తరఫు నుంచి ప్రోత్సాహకాన్ని అందించడానికి తన వంతు కృషి చేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్.ఢిల్లీరావు తెలిపారు. పురస్కారాలు అందుకున్న వారందరికీ అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో ప్రముఖ మిద్దెతోట నిపుణులు తుమ్మేటి రఘోత్తమరెడ్డి, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై.వేంకటేశ్వరరావు రైతులు, తదితరులు పాల్గొన్నారు.
డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు
రైతునేస్తం ఫౌండేషన్ మిద్దెతోటల పురస్కారాలు ప్రదానం
Comments
Please login to add a commentAdd a comment