విద్యుత్ రంగం ప్రైవేటీకరణ సరికాదు
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు
బాపట్లటౌన్ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేయటం సరికాదని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకు నిరసనగా సోమవారం పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. కె.ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ మూడోసారి అధికారంలోకి వచ్చిన బీజెపీ ప్రభుత్వం దేశంలో విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయాలని తీవ్రంగా ప్రయత్నం చేస్తుందన్నారు. చండీఘర్, ఉత్తరప్రదేశ్, తెలంగాణలో డిస్కంలను ప్రైవేటుపరం చేసి అదానికి కట్ట పెట్టాలని ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఇప్పటికే స్మార్ట్ మీటర్లు బిగించి వినియోగదారులపై భారం మోపుతున్నారని, విద్యుత్‌ను ప్రైవేటు మార్గంలో పయనించటానికి ప్రయత్నాలు ప్రారంభించిందన్నారు. విద్యుత్తు రాబోయే కాలంలో అంగడి సరుకుగా మారిపోతుందన్నారు. దీనిద్వారా దేశంలో అదానీలాంటి పెద్ద బడా పెట్టుబడిదారులకు లబ్ధి చేకూర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్, చండీఘర్‌లో విద్యుత్ కార్మికులు చేస్తున్న పోరాటానికి సీఐటీయూ సంపూర్ణ మద్దతు అందిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే విద్యుత్తు ప్రైవేటీకరణను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి సీహెచ్ మజుందార్, బాపట్ల పట్టణ కార్యదర్శి జై శామ్యూల్ నాయకులు శరత్, యు శామ్యూల్, వీరాస్వామి, ప్రభాకర్, మారుతి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment