రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
బాపట్ల: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రఖర్ జైన్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్‌లో జిల్లా రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం మంగళవారం నిర్వహించారు. జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ ప్రమాదాల నివారణకు పలు సూచనలు చేశారు. 2023లో జిల్లా వ్యాప్తంగా 567 ప్రమాదాలు జరగగా, 2024లో 522 జరిగాయని తెలిపారు. ఈ సంఖ్య జీరోకు తీసుకువచ్చేందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. గుర్తించిన బ్లాక్ స్పాట్‌లలో వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని నేషనల్ హైవే, ఆర్ అండ్ బీ, మునిసిపల్ అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులకు సహాయపడే వారికి ఎటువంటి ఇబ్బందులు కలిగించవద్దని మెడికల్, పోలీస్ అధికారులకు సూచించారు. ప్రమాదాలలో గాయపడిన క్షతగాత్రులకు సహాయపడే వారికి రూ.5,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ విఠలేశ్వర్, జిల్లా రవాణాశాఖ అధికారి టి.కె.పరంథామరెడ్డి, డీఎంహెచ్‌ఓ ఎస్.విజయమ్మ, బాపట్ల, చీరాల, రేపల్లె డీఎస్పీలు, బాపట్ల, చీరాల, అద్దంకి మునిసిపల్ కమిషనర్లు, నేషనల్ హైవే అధికారులు, ఆర్ అండ్ బీ అధికారులు, ఆర్టీసీ డిపో మేనేజర్లు పాల్గొన్నారు.
జాయింట్ కలెక్టర్ ప్రఖర్‌జైన్
Comments
Please login to add a commentAdd a comment