నిజాంపట్నం హార్బర్ అభివద్ధిలో భాగంగా ఎండు చేపల ఫ్యాక్టరీ ఏర్పాటుకు సమగ్ర ప్రణాళిక రూపొందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి తెలిపారు. జిల్లాస్థాయి కమిటీ సమావేశం మంగళవారం స్థానిక కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. స్ఫూర్తి ప్రాజెక్టు ద్వారా జిల్లాలో ఎండు చేపల ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయా లని తెలిపారు. మారిటైం బోర్డు పరిధిలోనే హార్బర్‌కు అనుసంధానంగా ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తామన్నారు. తీర ప్రాంతాల కారిడార్‌లో ఎండు చేపల ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే 500 మంది పొదుపు సంఘాలలోని మహిళా సభ్యులు జీవనోపాధి పొందుతారన్నారు. రెండు ఎకరాల భూమిని కేటాయించాలని అటవీ శాఖ అధికారులను ఆయన ఆదేశించారు. ఆ ప్రాంతంలో మడ అడవులు ఉన్నందున ప్రభుత్వానికి నివేదిక పంపాలని చెప్పారు. నిజాంపట్నం హార్బర్ ఫేజ్–2 కింద జరుగుతున్న అభివృద్ధి పనులకు మరికొంత భూమి కేటాయించాలని ఇప్పటికే మారిటైం బోర్డ్ ప్రతిపాదించిందన్నారు. స్ఫూర్తి ప్రాజెక్టు ద్వారా 90 శాతం రాయితీపై రూ.ఐదు కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుందన్నారు. డీఆర్‌డీఏ పీడీ పద్మ, మత్స్య శాఖ సహాయ సంచాలకులు కృష్ణకిషోర్, అటవీ శాఖ అధికారి భీమయ్య, మారిటైం బోర్డు అధికా రు లు, అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment