సర్కార్‌పై ‘ఫీజు పోరుబాట’కు సిద్ధం
బాపట్ల: కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా సమూలంగా నాశనం చేసేందుకు కంకణం కట్టుకుందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ధ్వజమెత్తారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయకపోవడంతో యాజమాన్యాల నుంచి తీవ్ర ఒత్తిళ్లను విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. విద్యార్థులకు అండగా ఫిబ్రవరి 5న వైఎస్సార్ సీపీ ‘ఫీజు పోరుబాట’ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మొండివైఖరిని విడనాడాలని కోరుతామని చెప్పారు. స్థానిక వైఎస్సార్ సీపీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఫీజు పోరు పోస్టర్లను ఆవిష్కరించి మాట్లాడారు. నాడు–నేడు పథకంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విద్యాభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇచ్చారని గుర్తు చేశారు. విద్యార్థులకు అన్ని వసతులతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో చక్కని చదువులు కొనసాగించినట్లు తెలిపారు. నాలుగు త్రైమాసికాలుగా బకాయిలు పెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన ద్వారా రూ.3,900కోట్లు బకాయిలను తక్షణమే విడుదల చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సూపర్ సిక్స్‌తో ప్రజలను నమ్మించి ఇప్పుడు ‘నిధులులేవు..మేము చేయలేకపోతున్నామ’ని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటని ఖండించారు. విద్యార్థుల పక్షాన అండగా నిలుస్తూ చంద్రబాబు సర్కార్‌పై నిరసన గళం విప్పేందుకు ఈనెల 5న వైఎస్సార్ సీపీ ఫీజు పోరు కార్యక్రమాన్ని చేపట్టిందని మేరుగ నాగార్జున పేర్కొన్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులతో కలిసి కలెక్టర్ కార్యాలయాలలో వినతి పత్రాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఫీజు పోరులో అందరూ పాల్గొనాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు మరుప్రోలు కొండలరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోకి రాఘవరెడ్డి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు వై.సోహిత్, పార్టీ నాయకులు వడ్డిముక్కల డేవిడ్, చల్లా రామయ్య, కొక్కిలిగడ్డ చెంచయ్య, మోర్ల సముద్రాల గౌడ్, గంగిశెట్టి రత్తయ్య, గొర్రుముచ్చు వెంకటేశ్వర్లు, జోగి రాజా, తన్నీరు అంకమ్మరావు, బడుగు ప్రకాశరావు, కటికల యోహోషువా పాల్గొన్నారు.
పార్టీ జిల్లా అధ్యక్షులు మేరుగ నాగార్జున ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులు వెంటనే విడుదలచేయాలి బకాయిలు చెల్లించకపోవడంతో ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు
Comments
Please login to add a commentAdd a comment