గొట్టిపాటి ఇలాకాలో దౌర్జన్యాలు
ఇటీవల అద్దంకి మండలం చిన్నకొత్తపల్లిలో 20 కుటుంబాల వారి పశువుల పాకలు, వామి దొడ్లు, పేడ దిబ్బలు ధ్వంసం చేసి నిరాశ్రయులను చేశారు. దశాబ్దాలుగా గ్రామకంఠం స్థలంలో అక్కడి రైతులు వాటిని వేసుకున్నారు. గత ప్రభుత్వంలో సచివాలయ భవనాల నిర్మాణం కోసం తలో రెండు సెట్లు స్థలమిచ్చారు కూడా. కూటమి అధికారంలోకి వచ్చాక మొత్తం స్థలం ఖాళీ చేసి వెళ్లిపొమ్మని పచ్చనేతలు ఒత్తిడి తేవడంతో అధికారులు మూడు రోజుల కిందట పాకలు, వామిలు, పేడ దిబ్బలు ధ్వంసంచేసి అక్కడున్న వారందరినీ నిరాశ్రయులను చేశారు.
● ఇదే గ్రామంలో డిసెంబర్ 19న వైఎస్సార్ సీపీ సానుభూతి పరుడు చెన్నుపాటి వెంకటేశ్వరరావును పచ్చపార్టీ మద్దతుదారులుగా ఉన్న బంధువులు అత్యంత పాశవికంగా ట్రాక్టరతో తొక్కించి చంపారు. పేరుకు సాగు భూమి తగాదాగా చూపించినా వైఎస్సార్ సీపీకి మద్దతుగా నిలిచాడన్న అక్కసుతోనే చంపినట్లు కుటుంబ సభ్యులు ఆరోపించారు.
● ఇదే మండలం ధర్మరానికి చెందిన వైఎస్సార్‌సీపీ నేత ప్రభాకరరెడ్డి అనుచరులపై దాడులతోపాటు ఆయన ఆస్తులను ధ్వంసం చేయడంతోపాటు వారిపైనే అక్రమ కేసులు పెట్టి వేధించారు.
Comments
Please login to add a commentAdd a comment