12న ఉమ్మడి ఏపీ ఆయిల్ పామ్ రైతుల సమావేశం
అశ్వారావుపేటరూరల్/దమ్మపేట: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ స్థాయి ఆయిల్‌పామ్ సాగుదారుల సమావేశాన్ని ఈ నెల 12న నిర్వహించనున్నట్లు ఆయిల్‌ఫెడ్ జనరల్ మేనేజర్ టి.సుధాకర్‌రెడ్డి తెలిపారు. అశ్వారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ, నూతనంగా నిర్మిస్తున్న పవర్ ప్లాంట్‌తోపాటు రైతుల సమావేశం నిర్వహణకు వేదికను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగుదారుల సమావేశానికి రాష్ట్ర మంత్రులతోపాటు సంఘాల బాధ్యులను ఆహ్వానిస్తామని తెలిపారు. కాగా, ఫ్యాక్టరీ వద్ద రూ.30 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న పవర్ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఏటా రూ.2కోట్ల విద్యుత్ బిల్లుల భారం తగ్గుతుందని వెల్లడించారు. అనంతరం దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీని జీఎం సుధాకర్‌రెడ్డి పరిశీలించి విస్తరణ పనుల వివరాలపై అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమాల్లో వివిధ విభాగాల అధికారులు శ్రీకాంత్, ఆకుల బాలకృష్ణ, నాగబాబు, కల్యాణ్, శ్రీకాంత్‌రెడ్డి, రాధాకృష్ణ, పవన్, గోపాలకృష్ణ, నాయకులు మొగళ్లపు చెన్నకేశవరావు, బండి భాస్కర్, ఎస్‌కే. పాషా, జ్యేష్ట సత్యనారాయణ పాల్గొన్నారు.
డీఎస్సీ అభ్యర్థుల
వివరాలు ఆన్‌లైన్..
కొత్తగూడెంఅర్బన్: డీఎస్సీ–2024 ధ్రువపత్రాల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల వివరాలు ఆన్‌లైన్‌లో నమోదు చేసే ప్రక్రియను జిల్లా విద్యాశాఖాధికారులు ప్రారంభించారు. అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ సింగరేణి ఉన్నత పాఠశాలలో శుక్రవారం కొనసాగింది. జిల్లాలో మొత్తం 447 పోస్టులు ఉండగా, 1015 మంది అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలిస్తున్నారు. మూడు రోజుల్లో 852 మంది అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయింది. మిగిలిన 163 మంది ధ్రువపత్రాలను చివరి రోజైన శనివారం పరిశీలిస్తామని డీఈఓ వెంకటేశ్వరాచారి తెలిపారు. అభ్యర్థులు తప్పనిసరిగా సాయంత్రం 5 గంటలలోగా హాజరుకావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన పూర్తయిన అభ్యర్థుల సమాచారం ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. కాగా గుండాల మండలానికి చెందిన అభ్యర్థిని ఈసం విజయనిర్మల కొద్దిరోజులుగా డెంగీ జ్వరంతో బాధపడుతోంది. నడవలేని స్థితిలో బంధువుల సహాయంతో వెరిఫికేషన్‌కు హాజరుకాగా, పరిస్థితిని గమనించిన డీఈఓ వెంకటేశ్వరాచారి సూచనల మేరకు ఎంఈఓ డాక్టర్ ఎం.ప్రభుదయాల్ ప్రత్యేక సదుపాయలు కల్పించి వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తి చేయించారు.
రామయ్య సేవలో
గనుల శాఖ అధికారి..
భద్రాచలంఅర్బన్: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారిని శుక్రవారం రాష్ట్ర గనుల, జియాలజీ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్ దర్శించుకున్నారు. ఆలయ ప్రదక్షిణ అనంతరం అంతరాలయంలో మూలమూర్తులను దర్శించుకుని పూజలు చేశారు. అంతకుముందు భద్రాచలంలో జరుగుతున్న ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వేను పరిశీలించి, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఆర్డీఓ దామోదర్‌రావు, భద్రాచలం తహసీల్దార్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది లింగాల సాయిబాబ, ఆలయ అర్చకులు, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment