జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపిక
గుండాల: గిరిజన గురుకుల కళాశాల నుంచి జాతీయస్థాయి వాలీబాల్ పోటీలకు ఇద్దరు విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ మేరకు గుండాల గురుకులం ప్రిన్సిపాల్ సత్యనారాయణ గురువారం వివరాలు వెల్లడించారు. ఈ నెల 16 నుంచి 18 వరకు మెదక్ జిల్లా చేగుంటలో నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో కళాశాల విద్యార్థులు ఇ.సన్ని, వై.నవదీప్ అండర్–14 విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చారు. గోల్డ్‌మెడల్ సాధించడంతోపాటు జాతీయస్థాయికి ఎంపికయ్యారు. వచ్చే నెల 10వ తేదీ నుంచి 14 వరకు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం వారణాసిలో జరగనున్న క్రీడా పోటీల్లో పాల్గొననున్నారు. విద్యార్థులను ప్రిన్సిపాల్‌తోపాటు పీఈటీ బాబూరావు, బుచ్చయ్య అభినంధించారు.
విద్యుత్ టోల్ ఫ్రీ
నంబర్ 1912..
సింగరేణి(కొత్తగూడెం): విద్యుత్ వినియోగదా రులకు మెరుగైన సేవలు అందించేలా టోల్ ఫ్రీ నంబర్ 1912 ఏర్పాటు చేశామని కొత్తగూడెం సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ జి.మహిధర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని ట్రాన్స్‌ఫార్మర్లపై నంబర్ ముద్రిస్తున్నట్లు పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల ఫెయిల్యూర్, వి ద్యుత్ సరఫరాలో అంతరాయం, బిల్లుల్లో హెచ్చుతగ్గులు, ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, విద్యుత్ మీ టర్లలో మార్పులు, అన్ని రకాల కొత్త కనెక్షన్ల మంజూరుకు సంబంధించిన పేరు మార్పు, కేట గిరీ మార్పు, లోడ్ మార్పు తదితర సేవలు టోల్ ఫ్రీ నంబర్ ద్వారా పొందవచ్చని అన్నారు.
పౌష్టికాహారం
ప్రతీ పౌరుడి హక్కు
ఖమ్మం సహకారనగర్: పౌరులంతా పౌష్టికాహారం అందుకోవడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యులు ఓరుగంటి ఆనంద్, భూక్యా జ్యోతి తెలిపారు. ఈ మేరకు అమల్లో ఉన్న ఆహార భద్రత చట్టాన్ని అధికారులు పక్కాగా అమలు చేయాలని సూచించారు. ఖమ్మం కలెక్టరేట్‌లో ఆహార భద్రత చట్టం అమలుపై అదనపు కలెక్టర్ పి.శ్రీనివాసరెడ్డితో కలిసి వారు అధికారులతో సమీక్షించారు. ఖమ్మం జిల్లా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అమలు, న్యూట్రీ గార్డెన్ల వివరాలను అధికారులు వెల్లడించారు. అనంతరం సభ్యులు ఆనంద్, జ్యోతి మాట్లాడుతూ విద్యార్థుల శారీరక అభివృద్ధికి అవసరమైన పోషకాలు అందేలా మెనూ రూపొందించినందున అమలుచేయాలన్నారు. అయితే, వెజిటబుల్ బిర్యానీ, కోడిగుడ్ల సరఫరాలో లోపాలు గుర్తించామని తెలిపారు. గురుకులాలకు చిన్న సైజ్ గుడ్లు సరఫరా చేసిన కాంట్రాక్టర్‌కు మెమో జారీ చేయడంతోపాటు తీసుకున్న చర్యలపై 15రోజుల్లో నివేదిక అందించాలని సూచించారు. పాఠశాలల్లో ఫిర్యాదు బాక్సులు ఏర్పాటు చేయాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment