స్పెల్ బీ, మ్యాథ్ బీతో మేధస్సు
●భవిష్యత్‌కు దోహద పడేలా పరీక్షలు ●‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహణ.. విశేష స్పందన ●పరీక్షా కేంద్రాన్ని సందర్శించిన రెజొనెన్స్ డైరెక్టర్లు నాగేంద్రకుమార్, శ్రీధర్‌రావు
ఖమ్మంసహకారనగర్: విద్యార్థుల మేధస్సుకు పదు ను పెట్టేలా.. భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని సాక్షి మీడియా ఆధ్వర్యంలో సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలు నిర్వహించటం అభినందనీయమని రెజొనెన్స్ విద్యాసంస్థల డైరెక్టర్లు ఆర్‌వీ నాగేంద్రకుమార్, కొండా శ్రీధర్‌రావు పేర్కొన్నారు. సాక్షి మీడియా ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో సాక్షి స్పెల్ బీ, మ్యాథ్ బీ పరీక్షలను ఆదివారం నగరంలోని రెజొనెన్స్ జూనియర్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా రెజొనెన్స్ డైరెక్టర్లు మాట్లాడుతూ.. సాక్షి మీడియా ఆధ్వర్యంలో విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు పరీక్షలు నిర్వహిస్తున్నారని, తొలుత పాఠశాల స్థాయిలో పరీక్షలు నిర్వహించగా ప్రతిభ కనబర్చిన వారికి జిల్లాస్థాయిలో పరీక్షలు నిర్వహించారని తెలిపారు. ఇక్కడ ప్రతిభ కనబర్చిన వారు రీజినల్, రాష్ట్రస్థాయికి వెళ్తారన్నారు. స్పెల్ బీ విద్యార్థులకు ఇంగ్లిష్‌పై పట్టు సాధించేలా, మ్యాథ్ బీ విద్యార్థులకు గణితంపై మరింత ఆసక్తిని పెంచేలా ఈ పరీక్షలు ఉన్నాయని చెప్పారు. రెజొనెన్స్ కళాశాలలో జరిగిన పరీక్షా కేంద్రంలో నగరంలోని సర్వజ్ఞ, న్యూ విజన్, హార్వెస్ట్, బ్లూమింగ్ మైండ్స్, మిలీనియం, బ్లూసమ్స్, బీబీఎం, రెజొనెన్స్ ఇన్ఫో, రెజొనెన్స్ శ్రీనగర్, ఆక్స్‌ఫర్డ్, నిర్మల్ హృదయ్, త్రివేణి, మధిరలోని శ్రీనిధి, నారాయణ, సత్తుపల్లిలోని కేకేఆర్ గౌతమ్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని త్రివేణి, భద్రాచలంలోని సెయింట్ పాల్స్ పాఠశాలలతో పాటు పలు పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. సాక్షి మీడియా గ్రూప్, అసోసియేట్ స్పాన్సర్ ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ రాజమండ్రి, ప్రెసెంటింగ్ స్పాన్సర్ డ్యూక్స్ వ్యాఫీ వ్యవహరించారు. పరీక్షలను సాక్షి బ్రాంచ్ మేనేజర్ మోహన్‌కృష్ణ పర్యవేక్షించగా... సాక్షి సిబ్బంది వేణు, ఏవీ రామారావు, నందగోపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఆనందంగా ఉంది..
స్పెల్ బీ పరీక్ష రాయటం చాలా ఆనందంగా ఉంది. దీని ద్వారా విజ్ఞానం పెరుగుతుంది. పోటీ పరీక్షలను ఇప్పటి నుంచే రాయటం ద్వారా భవిష్యత్‌లో ఎలాంటి పరీక్షలనైనా సులభంగా రాసే అవకాశం ఉంటుంది. మరిన్ని పోటీ పరీక్షలను నిర్వహించాలని ఆకాంక్షిస్తున్నా.
– పి.షరన్‌రోస్, శ్రీనిధి కాన్సెప్ట్ స్కూల్, మధిర
Comments
Please login to add a commentAdd a comment