పాల్వంచరూరల్ : ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్‌లో బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాల్లో అక్రమాలు జరిగిన నేపథ్యంలో స్థానిక డీసీసీబీ బ్రాంచ్‌లోనూ అధికారులు బంగారు రుణాలపై తనిఖీలు చేపడుతున్నారు. పాల్వంచ కో ఆపరేటివ్ బ్యాంక్ శాఖలో కొత్తగూడెం బ్రాంచ్ మేనేజర్, టేకులపల్లి శాఖలో పాల్వంచ బ్రాంచ్ మేనేజర్ గురువారం తనిఖీ చేశారు. ఎంతమంది బంగారు ఆభరణాలు తనఖా పెట్టారు, ఎంత రుణం తీసుకున్నారు, ఆ బంగారం నాణ్యమైనదా, నకిలీదా అనే కోణంలో అధికారులు క్షుణంగా తనిఖీ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment