సమస్యలు పరిష్కరించేనా?
సింగరేణి(కొత్తగూడెం): సింగరేణి కార్మికులు సుమారు 11 మాసాలుగా ఎదురుచూస్తున్న కంపెనీస్థాయి స్ట్రక్చరల్ సమావేశం ఈ నెల 28న కొత్తగూడెంలోని సంస్థ ప్రధాన కార్యాలయంలో నిర్వహించనున్నారు. గత డిసెంబర్ నెలాఖరులో జరిగిన ఎన్నికల్లో ఏఐటీయూసీ గుర్తింపు కార్మిక సంఘంగా ఎన్నికయ్యాక తొలిసారిగా సమావేశం నిర్వహిస్తున్నారు. స్ట్రక్చరల్ సమావేశం మూడు మాసాలకోసారి నిర్వహించాల్సి ఉండగా, 11 నెలల తర్వాత జరుపుతున్నారు. ఈ సమావేశంలో కార్మిక సమస్యలను చర్చించి పరిష్కరించాలని కార్మికులు, కార్మిక నాయకులు కోరుతున్నారు. క్రమంతప్పకుండా మూడు నెలలకోసారి స్ట్రక్చరల్ సమావేశం నిర్వహించాలని గుర్తింపు కార్మిక సంఘానికి, సింగరేణి యాజమాన్యానికి కార్మికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
11 నెలల జాప్యం తర్వాత సమావేశం
నిర్వహిస్తున్న యాజమాన్యం
డైరెక్టర్ (పా)స్థాయిలో గుర్తింపు
కార్మిక సంఘం నేతల చర్చలు
నేడు కొత్తగూడెంలో సింగరేణి
కంపెనీస్థాయి స్ట్రక్చరల్ మీటింగ్
Comments
Please login to add a commentAdd a comment