జాతీయస్థాయి సైన్స్‌ఫేర్‌కు ఎంపిక
కొత్తగూడెంఅర్బన్: డిసెంబర్ 16 నుంచి 21వ తేదీ వరకు హరియాణాలోని పంచకులలో జరిగే జాతీ యస్థాయి సైన్స్‌ఫేర్‌కు జిల్లా నుంచి టి.వరుణ్ కోమల్, బి.దిప్సికా, ఎస్.దీపాహస్మిత ఎంపికయ్యారు. ఈ మేరకు డీఈఓ ఎం.వెంకటేశ్వరాచారి బుధవారం వివరాలు వెల్లడించారు. ఫిబ్రవరిలో విజయవాడలో జరిగిన సౌత్ ఇండియా సైన్స్‌ఫేర్‌లో జిల్లా నుంచి నాలుగు ఎగ్జిబిట్లు ప్రదర్శించగా, రెండు జాతీయస్థాయికి ఎంపికయ్యాయని తెలిపారు. ఇల్లెందు సింగరేణి ఉన్నత పాఠశాల విద్యార్థి టి.వరుణ్‌కోమల్ స్మార్ట్–అగ్రీ రోబో రూపొందించి.. వ్యవసాయ రంగంలో విత్తనాలు నాటడం, దున్నడం, పురుగు మందుల పిచికారీ తదితర పనులకు రోబో వినియోగించే తీరును వివరించారు. ఈ ఎగ్జిబిట్‌కు గైడ్ టీచర్‌గా ఎం.విష్ణుప్రియ వ్యవహరించారు. కొత్తగూడెం లక్ష్మీదేవిపల్లిలోని త్రివేణి పాఠశాల విద్యార్థులు బి.దీప్సికా, ఎస్.దీపాహస్మిత లిక్విడ్ ట్రీ–బయోఎంజైమ్స్ ఎగ్జిబిట్‌ను రూపొందించారు. పట్టణ ప్రాంతాలు, పర్యావరణ కాలుష్య ప్రాంతాల్లో లిక్విడ్ ట్రీ ప్లాంటేషన్‌తో కాలుష్యం తగ్గించవచ్చని వివరించారు. ఈ ప్రాజెక్ట్ కు గైడ్ టీచర్‌గా పి.జ్యోతి వ్యవహరించారు. జాతీయస్థాయికి ఎంపికై న విద్యార్థులను జిల్లా సైన్స్ ఆఫీసర్ చలపతిరాజు తదితరులు అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment