సమగ్ర కులగణన సర్వే చరిత్రాత్మకం
కొత్తగూడెంఅర్బన్: రాష్ట్రంలో చేపడుతున్న సమగ్ర కులగణన సర్వే చరిత్రాత్మకమని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అలంపూర్ నుంచి ఆదిలాబాద్ వరకు చేపట్టిన బీసీ కులగణన చైతన్య యాత్ర సందర్భంగా బుధవారం కొత్తగూడెంలో నిర్వహించిన చైతన్య సదస్సులో ఆయన మాట్లాడారు. కులగణన నిర్వహించి, బీసీల లెక్కలు తేల్చాలని మూడు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేతో ఫలప్రదమైందని పేర్కొన్నారు. బీసీల లెక్కలు తేలాక జనాభా దామషా ప్రకారం రిజర్వేషన్లు పెరిగే అవకాశం ఉందన్నారు. కులగణనను అడ్డుకోవాలని చూసిన రాష్ట్రంలోని కొన్ని శక్తుల ప్రయత్నాలు ఫలించలేదన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొనకుండా కులగణనను వ్యతిరేకిస్తున్న వారికి రిజర్వేషన్లు పొందే హక్కు లేదన్నారు. కులగణన సర్వేలో పాల్గొననివారిని గుర్తించి ప్రభుత్వం వాళ్ల రిజర్వేషన్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. నాయకులు కుల్కచర్ల శ్రీనివాస్ ముదిరాజ్,అకినీడు ప్రసాద్, సోమేశ్వర్‌గౌడ్, శ్రీనివాస్‌యాదవ్, లక్ష్మణాచారి , వెంకటేష్‌గౌడ్, సౌజన్య తదితరులు పాల్గొన్నారు.
బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్
Comments
Please login to add a commentAdd a comment