కరాటే అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా నవీన్
జూలూరుపాడు: జిల్లాస్పోర్ట్స్ కరాటే అసోసియేషన్ జాయింట్ సెక్రటరీగా పాపకొల్లు గ్రామానికి చెందిన బానోత్ నవీన్ ఎన్నికయ్యా రు. ఆదివారం కొత్తగూడెంలో జిల్లాస్పోర్ట్స్ కరాటే అసో సియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. నవీన్ మాట్లాడుతూ జిల్లా కార్యవర్గంలో చోటు కల్పించిన రాష్ట్ర కరాటే అసోసియేషన్ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
కరాటేలో బంగారు పతకం
గుండాల: తొమ్మిదో జాతీయస్థాయి కరాటే పోటీల్లో గుండాలకు చెందిన ఓ విద్యార్థి బంగారు పతకం సాధించాడు. మండల కేంద్రానికి చెందిన వాంకుడోత్ జగన్ కుమారుడు చిరంతన్ గురుకుల పాఠశాలలో 5వ తరగతి చదువుతున్నాడు. అండర్–11 విభాగంలో కిజమ్ స్పోర్ట్స్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్‌లో కుంగ్ ఫూ, కరాటే పోటీలు జరిగాయి. చిరంతన్ బంగారు పతకం సాధించగా.. పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
కరాటే అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నిక
కొత్తగూడెంటౌన్: కరాటే అసోసియోషన్ జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం కొత్తగూడెం ఓల్డ్ బస్టాండ్ సెంటర్‌లో నిర్వహించిన సమావేశంలో కమిటీ ఎన్నికై ంది. జిల్లా కరాటే అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా జి.శ్రీనివాసరావు, జనరల్ సెక్రటరీ ఇంద్రాల శ్రీధర్, వైస్ చైర్మన్‌గా జి.శ్రీనివాస్ యాద్, వైస్ ప్రెసిడెంట్‌లుగా జి.శ్రీకాంత్, ఈ రాధిక, టీ.వెంకటేశ్వర్లు, టి. ప్రణిత్, జాయింట్ సెక్రటరీలుగా బి. పవన్‌రెడ్డి, ఏ.రాజా, బి.నవీన్, ట్రెజర్ మురళి, ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా కె.రాము, టీ, వీరభద్రం, బి.శివప్రసాద్తోపాటు పలువురు సభ్యులుగా ఎన్నికయ్యారు. రాష్ట్ర కరాటే అసోసియేషన్ అబ్జర్వర్ వి.పిచ్చయ్య ఆధ్వర్యంలో ఈ ఎన్నిక జరిగిందని బాధ్యులు తెలిపారు.
యూనివర్సిటీ జట్టుకు హరిప్రియ ఎంపిక
పాల్వంచరూరల్: బాక్సింగ్ పోటీలో ప్రతిభ చూ పిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థిని హరిప్రియ యూనివర్సిటీ జట్టుకు ఎంపికై ంది. మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ ఫైనల్ ఇయర్ చదువుతున్న పొట్లపువ్వు హరిప్రియ వరంగల్‌లో ఇటీవల జరిగిన కాకతీయ యూనివర్సిటీ ఇంటర్ కాలేజియేట్ బాక్సింగ్ టోర్నమెంట్‌లో పాల్గొని ప్రతిభ చూపి బంగారు పతకం సాధించింది. ఈ సందర్భంగా విద్యార్థినిని ఆదివారం కళాశాల స్పోర్ట్స్ ఇన్‌చార్జి, ఫిజికల్ డైరెక్టర్ పొట్లపువ్వు శ్రీనివాసరావు, ప్రిన్సిపాల్ పద్మావతి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ జె.మాధవి అభినంధించారు.
Comments
Please login to add a commentAdd a comment