ఇల్లెందు: పట్టణంలోని ఓ పీడీఎఫ్ పత్రికా విలేకరిపై కేసు నమోదు కాగా, సోమవారం పోలీసులు రిమాండ్ చేశారు. ఎస్‌ఐ బి.సూర్య తెలిపిన, ఫిర్యాదులో వివరాల ప్రకారం.. ఈ నెల 23న నూతన సంవ్సతరం టార్గెట్ కోసం రూ.లక్ష ఇవ్వాలని ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ జి.హర్షవర్ధన్‌ను వీరన్న అనే విలేకరి డిమాండ్ చేశాడు. ఈనెల 5న ఆస్పత్రికి వెళ్లి అక్కడి ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించాడు. ప్రభుత్వాస్పత్రిలో స్కానింగ్ జరుగుతుండగా అక్కడి గదిలోకి అనుమతి లేకుండా వెళ్లి రోగుల ఫొటోలుతీశాడు. ఆస్పత్రి డాక్టర్లు, అక్కడి సిబ్బంది, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు కలిసి డబ్బులు అందజేయాలని డిమాండ్ చేశాడు. దీంతో సూపరింటెండెంట్ హర్షవర్ధన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీహెచ్‌ఎస్ డాక్టర్ రవిబాబు తదితరులు ఎస్పీ రోహిత్ రాజు ను సదరువ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దీంతో వీరన్నపై కేసునమోదు చేసిన పోలీసులు సోమవారం రిమాండ్ చేశారు.
మహిళ ఆత్మహత్య
మణుగూరు టౌన్: కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం... సునీత (35) అనే మహిళ గతంలో గుండాల మండలానికి చెంది న ఓ వ్యక్తిని వివాహం చేసుకుంది. కొంతకాలంగా భర్తను విడిచి చెరువుముందు సింగారం గ్రామంలోని బంధువుల ఇంట్లో ఉంటోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని మృతి చెందింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కోడి పందేల స్థావరంపై దాడి
అశ్వారావుపేటరూరల్: కోడి పందేల స్థావరంపై సోమవారం రాత్రి పోలీసులు దాడి చేశారు. ఎస్సై యయాతి రాజు కథనం ప్రకారం.. మండలంలోని వడ్డెర రంగాపురం గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో కోడి పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి చేసి ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.3 వేల నగదు, పది బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరికొందరు పందెం రాయుళ్లు పారిపోగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment